బాక్స్ ఆఫీస్ దగ్గర రికార్డులు ఏమి మిగలకుండా ఫాస్టెస్ట్ రికార్డులతో మాస్ ఊచకోత కోస్తూ దూసుకు పోతున్న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun) నటించిన సెన్సేషనల్ మూవీ పుష్ప2(Pushpa2 The Rule Movie) సినిమా ఇండియన్ మూవీస్ హిస్టరీలోనే ఎపిక్ రాంపెజ్ ను చూపెడుతూ మాస్ ఊచకోత కోస్తూ ఇప్పుడు…
4 వారాలను రిమార్కబుల్ కలెక్షన్స్ తో కంప్లీట్ చేసుకుంది…28వ రోజున సినిమాకి న్యూ ఇయర్ అడ్వాంటేజ్ కలిసి రావడంతో ఇండియన్ మూవీస్ పరంగా 28వ రోజు ఎపిక్ రికార్డ్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుని సంచలనం సృష్టించింది. హిందీలో మాస్ కుమ్ముడు కుమ్మేసిన సినిమా…
తెలుగు రాష్ట్రాలలో సైతం ఎక్స్ లెంట్ హోల్డ్ ని చూపించి రచ్చ చేసింది…ఓవరాల్ గా 28వ రోజు వరల్డ్ వైడ్ గా సినిమా 17-18 కోట్ల రేంజ్ లో ఎపిక్ గ్రాస్ ను మినిమమ్ వసూల్ చేసే అవకాశం ఉండటంతో టోటల్ గా 4 వారాలు పూర్తి అయ్యే టైంకి వరల్డ్ వైడ్ గా…
పుష్ప2 మూవీ సాధించిన కలెక్షన్స్ గ్రాస్ అక్షరాలా 1700 కోట్ల ఎపిక్ మార్క్ ని అందుకుని ఆల్ టైం రికార్డ్ ను సృష్టించింది. ఇండియన్ మూవీస్ లో ఏ సినిమా కూడా ఈ రేంజ్ లో ఫాస్ట్ గా ఈ మార్క్ ని టచ్ కూడా చేయలేదు….ఇండియన్ మూవీస్ లో ఎపిక్ రికార్డులతో..
ఊచకోత కోసిన పుష్ప2 మూవీ అంచనాలను మించిన భీభత్సం సృష్టించింది….బాహుబలి2 మూవీ ఇతర దేశాల రిలీజ్ కాకుండా ఆల్ మోస్ట్ ఫైనల్ రన్ టైంకి ఈ మార్క్ ని అందుకుంటే పుష్ప2 మూవీ కేవలం 4 వారాల టైంకే ఈ మమ్మోత్ రికార్డ్ ను సృష్టించింది…
కాగా సినిమా ఇప్పటికీ మంచి జోరుని చూపిస్తున్న తరుణంలో బాక్స్ ఆఫీస్ దగ్గర సంక్రాంతి సినిమాలు వచ్చే వరకు కూడా రన్ స్టడీగా ఉండే అవకాశం ఎంతైనా ఉంది. ఇక మిగిలిన రన్ లో పుష్ప2 మూవీ ఎలాంటి కలెక్షన్స్ ని సొంతం చేసుకుని చరిత్రలో నిలిచిపోయే బెంచ్ మార్క్ ని సెట్ చేస్తుందో చూడాలి.