బాక్స్ ఆఫీస్ దగ్గర సెన్సేషనల్ కలెక్షన్స్ తో మాస్ రచ్చ చేస్తూ దూసుకు పోతున్న విక్టరీ వెంకటేష్(Victory Venkatesh) అనిల్ రావిపూడి ల సంక్రాంతికి వస్తున్నాం(Sankranthiki Vasthunam Movie) రిమార్కబుల్ జోరుని చూపించి ఫస్ట్ వీక్ ని ఊహకందని రేంజ్ లో జోరు చూపించి కంప్లీట్ చేసుకుంది ఇప్పుడు….సినిమా 6 రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో ఓవరాల్ గా…
132.4 కోట్లకు పైగా గ్రాస్ మార్క్ ని అందుకుని రచ్చ చేయగా వరల్డ్ వైడ్ గా 170 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను సొంతం చేసుకుని సంచలనం సృష్టించగా 7వ రోజున వర్కింగ్ డే లోకి అడుగు పెట్టిన సినిమా అన్ని చోట్లా మంచి హోల్డ్ నే చూపెడుతూ మాస్ రచ్చ చేసింది….
మేజర్ ఏరియాల్లో డ్రాప్స్ లిమిటెడ్ గానే ఉండగా ఓవరాల్ గా సినిమా 7వ రోజున ప్రజెంట్ ట్రెండ్ ను బట్టి చూస్తుంటే ఓవరాల్ గా 8 కోట్ల రేంజ్ కి అటూ ఇటూగా గ్రాస్ ను అందుకునే అవకాశం కనిపిస్తూ ఉండగా ఫైనల్ ఆఫ్ లైన్ లెక్కలు కనుక బాగుంటే గ్రాస్ కలెక్షన్స్ లెక్క మరికొంత పెరిగే అవకాశం ఉంది.
ఇక కర్ణాటక, రెస్ట్ ఆఫ్ ఇండియా మరియు ఓవర్సీస్ లలో కూడా పర్వాలేదు అనిపించేలా జోరు చూపెడుతున్న సినిమా 10-11 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను సొంతం చేసుకునే అవకాశం అయితే ఉందని చెప్పాలి. ఇక ఆఫ్ లైన్ లెక్కలు బాగుంటే గ్రాస్ కలెక్షన్స్ మరింత పెరిగే అవకాశం ఉంది.
దాంతో మొత్తం మీద ఈ రోజు సాధించే కలెక్షన్స్ తో సినిమా తెలుగు రాష్ట్రాల్లో 140 కోట్ల రేంజ్ కి అటూ ఇటూగా గ్రాస్ మార్క్ ని అందుకోబోతూ ఉండగా వరల్డ్ వైడ్ గా సినిమా 180 కోట్ల రేంజ్ కి అటూ ఇటూగా వసూళ్ళని సొంతం చేసుకునే అవకాశం ఉంది. వెంకటేష్ కెరీర్ లో అల్టిమేట్ రికార్డులను నమోదు చేస్తున్న సినిమా ఫస్ట్ వీక్ లో అఫీషియల్ గా సాధించే కలెక్షన్స్ ఎలా ఉంటాయో చూడాలి.