హ్యాపిడేస్ సినిమాతో టాలీవుడ్ కి పరిచయం అయిన యంగ్ హీరో నిఖిల్, తర్వాత యువత, వీడు తేడా లాంటి సినిమాలతో పర్వాలేదు అనిపించినా తర్వాత నికార్సయిన హిట్ కోసం చాలా కాలం ఎదురు చూడాల్సి రాగా, స్వామిరారా నుండి నిఖిల్ లైఫ్ మారిపోయింది, ఆ సినిమా తర్వాత కార్తికేయ మరింత క్రేజ్ ని తెచ్చి పెట్టగా మళ్ళీ తర్వాత కొద్దిగా స్లో అయ్యాడు నిఖిల్. మధ్యలో ఎక్కడికి పోతావు చిన్నవాడా పాజిటివ్ టాక్ పవర్ తో…
డీ మానిటైజేషన్ టైం లో కూడా అల్టిమేట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది… ఇక రీసెంట్ టైం ఫ్లాఫ్స్ తర్వాత అర్జున్ సురవరం సినిమా తో 9.9 కోట్ల రేంజ్ లో కలెక్షన్స్ ని అందుకుంది సూపర్ హిట్ ని సొంతం చేసుకున్నాడు. ఇక ఇప్పుడు తన కెరీర్ లో…
సాలిడ్ విజయాన్ని అందుకున్న కార్తికేయ సినిమా కి సీక్వెల్ సినిమా తో ప్రస్తుతం బిజీగా ఉన్న నిఖిల్ ఈ సినిమా తో భారీ రిస్క్ చేస్తున్నాడు అనే చెప్పాలి. పాన్ ఇండియా లెవల్ లో రూపొందుతున్న ఈ సినిమా నిఖిల్ కెరీర్ లో భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న సినిమా…
18 కోట్ల రేంజ్ బడ్జెట్ తో ఈ సినిమా నిర్మాణం అవుతుందని సమాచారం… కార్తికేయ సినిమా రిలీజ్ తర్వాత ఇతర భాషల్లో కూడా డబ్ అవ్వడం ఆన్ లైన్ లో చాలా మంది చూడటం తో సినిమా కి మంచి క్రేజ్ ఏర్పడింది, కానీ ప్రస్తుతం నిఖిల్ మార్కెట్ దృశ్యా 10 కోట్ల రేంజ్ సేఫ్ బెట్ అయినా.. 18 కోట్ల తో రిస్క్ చేస్తున్న…
కార్తికేయ 2 సినిమా అన్నీ అనుకున్నట్లు జరిగి మొదటి పార్ట్ రేంజ్ లో ఉంటే కచ్చితంగా పాన్ ఇండియా లెవల్ లో రచ్చ చేయడం ఖాయమని చెప్పొచ్చు. లాక్ డౌన్ వలన షూటింగ్ ఆగిపోయిన ఈ సినిమా ఈ ఇయర్ ఎండ్ లో కానీ వచ్చే ఇయర్ సమ్మర్ టైం లో కానీ ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది. మరి నిఖిల్ ఈ సినిమా తో తన మార్కెట్ ని మరింత పెంచుకుంటాడో లేదో చూడాలి…