మాస్ కలెక్షన్స్ తో అన్ని చోట్లా దుమ్ము దుమారం లేపుతూ దూసుకు పోతున్న టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్(Jr NTR) నటించిన లేటెస్ట్ మూవీ దేవర(Devara Part 1) మూడో వీకెండ్ ని ఊహకందని కలెక్షన్స్ తో కంప్లీట్ చేసుకున్న తర్వాత వర్కింగ్ డేస్ లోకి తిరిగి ఎంటర్ అవ్వగా కోస్టల్ ఆంధ్రలో కొన్ని చోట్ల పార్షిక హాలిడే ఉండగా…
కొన్ని చోట్ల వర్షాల వలన ఇబ్బందులు కూడా ఉన్నప్పటికీ మొత్తం మీద సినిమా మరోసారి వర్కింగ్ డే లో మంచి హోల్డ్ ని చూపించింది. సినిమా ప్రీవియస్ వర్కింగ్ డే అయిన శుక్రవారంతో పోల్చితే ఆల్ మోస్ట్ 25-30% రేంజ్ లో టికెట్ సేల్స్ లో డ్రాప్స్ కనిపిస్తూ ఉండగా…
ఆఫ్ లైన్ లో పర్వాలేదు అనిపించే రేంజ్ లో బుకింగ్స్ ట్రెండ్ ఉండటంతో మొత్తం మీద ట్రాక్ చేసిన సెంటర్స్ ను బట్టి తెలుగు రాష్ట్రాల్లో 80-90 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం ఉండగా ఫైనల్ ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు బాగుంటే సినిమా…
కోటి షేర్ మార్క్ ని అందుకునే అవకాశం ఉందని చెప్పాలి ఇప్పుడు….ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు అంచనాలను మించి పోయి సినిమా 1.2 కోట్లు ఆ పైన షేర్ ని అందుకుంటే లాంగ్ రన్ ఇక దీపావళి వరకు స్టడీగా ఉండే అవకాశం ఎంతైనా ఉంటుంది అని చెప్పాలి ఇప్పుడు…
ఇక తెలుగు రాష్ట్రాల ఆవల కర్ణాటక మరియు హిందీలో కొంచం పర్వాలేదు అనిపిస్తూ ఉండగా వరల్డ్ వైడ్ గా 18వ రోజున సినిమా 1.2-1.4 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం ఉండగా ఫైనల్ లెక్కలు బాగుంటే షేర్ ఇంకొంచం పెరిగే అవకాశం ఉంది. ఇక టోటల్ గా 18 రోజుల్లో వరల్డ్ వైడ్ గా ఎలాంటి కలెక్షన్స్ ని అందుకుంటుందో చూడాలి ఇక…