ఏప్రిల్ 28….టాలీవుడ్ కి చాలా స్పెషల్ డేట్స్ లో ఒకటి…ఈ టైంలో బాహుబలి2 రికార్డుల జాతర సృష్టించగా అంతకన్నా ముందు 2006 టైం సాదా సీదా కమర్షియల్ మూవీగా రిలీజ్ అయ్యి ఇండస్ట్రీ రికార్డుల బెండు తీసిన సూపర్ స్టార్ మహేష్ బాబు(Mahesh Babu) నటించిన పోకిరి(18 Years For Pokiri Movie) సినిమా రిలీజ్ అయిన రోజు….
ఒక్కడు బ్లాక్ బస్టర్ తర్వాత నిజం, నాని సినిమాల డిసాస్టర్ రిజల్ట్ ల తర్వాత అర్జున్ మరియు అతడు సినిమాలు పర్వాలేదు అనిపించేలా ఆకట్టుకున్నా మళ్ళీ ఒక్కడు రేంజ్ బ్లాక్ బస్టర్ కోసం ఎదురు చూస్తున్న టైంలో ఆడియన్స్ ముందుకు మంచి అంచనాల నడుమ రిలీజ్ అయిన పోకిరి మూవీ….
2006 టైంలో ఇండస్ట్రీ రికార్డుల బెండు తీసి సంచలన బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. సౌత్ లో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ హిట్ మూవీస్ లో ఆ టైంలో ముందు నిలిచే సినిమాగా మారిన ఈ సినిమా రికార్డులు మగధీర సినిమా వచ్చే వరకు అలాగే ఉండటం విశేషం. ఆ రేంజ్ లో సంచలనం సృష్టించిన పోకిరి సినిమా 48 సెంటర్స్ లో 175 రోజులను కంప్లీట్ చేసుకుంది…
ఇక ఆ టైంలో ఆల్ మోస్ట్ 16 కోట్ల రేంజ్ లో బిజినెస్ ను సొంతం చేసుకున్న ఈ సినిమా టోటల్ రన్ లో ప్రీవియస్ టాలీవుడ్ ఇండస్ట్రీ హిట్ అయిన ఇంద్ర మూవీ 32 కోట్ల షేర్ రికార్డ్ ను బ్రేక్ చేసి టోటల్ రన్ లో 36.6 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకుని బిజినెస్ మీద ఆ టైంలోనే…
20.06 కోట్ల రేంజ్ ఎపిక్ ప్రాఫిట్ ను సొంతం చేసుకుని సంచలనం సృష్టించింది….ఇక రెండేళ్ళ క్రితం టాలీవుడ్ లో రీ రిలీజ్ ల ట్రెండ్ కి నాంది పలికిన ఈ సినిమా స్పెషల్ షోలతో ఏకంగా 1.73 కోట్ల గ్రాస్ ను సొంతం చేసుకుంది…కమర్షియల్ మాస్ మూవీస్ లో టాలీవుడ్ లో పోకిరి ఎప్పటికీ ఓ స్పెషల్ పేజీ అయితే ఉంటుంది అని చెప్పాలి. అలాంటి ఈ సినిమా రిలీజ్ అయ్యి నేటితో 18 ఏళ్ళు కంప్లీట్ అవ్వడం విశేషం…