Home న్యూస్ 2 డేస్ రత్నం మూవీ టోటల్ కలెక్షన్స్…దెబ్బ మీద దెబ్బ ఇది!

2 డేస్ రత్నం మూవీ టోటల్ కలెక్షన్స్…దెబ్బ మీద దెబ్బ ఇది!

0

Rathnam Movie 2 Days Total WW Collections – బాక్స్ ఆఫీస్ దగ్గర లాస్ట్ ఇయర్ మార్క్ అంథోని(mark antony) లాంటి బ్లాక్ బస్టర్ తో 102 కోట్ల వసూల్లను అందుకున్న విశాల్(Vishaal) నటించిన కొత్త సినిమా రత్నం(Rathnam Movie) ఆడియన్స్ ముందుకు రీసెంట్ గా రిలీజ్ అయ్యింది. హరి డైరెక్షన్ లో వచ్చిన ఈ సినిమాకి ఆడియన్స్ నుండి మిక్సుడ్ రెస్పాన్స్ రాగా..

మొదటి రోజు కలెక్షన్స్ పరంగా పెద్దగా ఇంపాక్ట్ ఏమి చూపించ లేక పోయిన ఈ సినిమా వరల్డ్ వైడ్ గా 3.6 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను అందుకోగా రెండో రోజుకి వచ్చే సరికి సినిమా ఏమాత్రం హోల్డ్ ని చూపించ లేక పోయింది. తమిళ్ లో 2 కోట్ల రేంజ్ లో తెలుగు లో 55 లక్షల రేంజ్ లో గ్రాస్ ను మాత్రమె అందుకుంది.

టోటల్ గా 2 రోజుల్లో సినిమా తెలుగు రాష్ట్రాల్లో ఓవరాల్ గా 1.25 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను 75 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకుంది. తమిళ్ లో 4.5 కోట్ల లోపు గ్రాస్ ను అందుకున్న ఈ సినిమా రెండో రోజు వరల్డ్ వైడ్ గా 3 కోట్ల లోపు గ్రాస్ ను సొంతం చేసుకోవడంతో… టోటల్ గా 2 రోజుల్లో వరల్డ్ వైడ్ గా…

గ్రాస్ లెక్క 6.6 కోట్ల రేంజ్ లో ఉండగా వర్త్ షేర్ 3 కోట్ల రేంజ్ లోనే ఉంటుందని అంచనా.. తెలుగు లో సినిమా హిట్ అవ్వాలి అంటే 4.5 కోట్లు వసూల్ చేయాల్సి ఉంటుంది. తమిళ్ లెక్కలు ఇంకా క్లియర్ గా లేదు కానీ ఓవరాల్ గా మాత్రం సినిమా కి రెండో రోజు దెబ్బ మీద దెబ్బ పడినట్లు అయింది…

ఓల్డ్ మూవీ గిల్లి వసూళ్ళ పరంగా రత్నం మూవీని ఫుల్లుగా డామినేట్ చేస్తూ ఉండటంతో రత్నం మూవీ తేరుకునే అవకాశం తక్కువగానే ఉందని చెప్పాలి ఇప్పుడు. ఇక ఆదివారం రోజున అయినా ఎంతో కొంత గ్రోత్ ని సినిమా చూపిస్తుందో లేదో చూడాలి ఇప్పుడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here