Home న్యూస్ #18YrsOfTorchBearerNTR స్పెషల్

#18YrsOfTorchBearerNTR స్పెషల్

0

     టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ టాలీవుడ్ లో అడుగు పెట్టి నేటితో 18సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా సోషల్ మీడియా లో అభిమానులు భారీ ఎత్తున ట్రెండ్ ని మొదలు పెట్టారు. టాలీవుడ్ లో ప్రస్తుతం ఉన్న స్టార్స్ లో వన్ ఆఫ్ ది బెస్ట్ యాక్టర్ గా పేరు తెచ్చుకున్న యంగ్ టైగర్ ఈ 18 ఏళ్లలో మొత్తం మీద 28 సినిమాలను పూర్తి చేసుకున్నాడు. గత కొంత కాలంగా వరుస విజయాలతో దూసుకు పోతున్నాడు.

కెరీర్ ని ఎలాంటి స్టార్ హంగులు లేకుండా మొదలు పెట్టిన ఎన్టీఆర్ ఆది సింహాద్రి సినిమాలతో స్టార్ గా ఎదిగి అతి తక్కువ సమయం లోనే ఏకంగా 5 కోట్ల రేంజ్ రెమ్యూనరేషన్ ని అందుకునే రేంజ్ కి ఎదిగాడు. తర్వాత మళ్ళీ వరుస పరాజయాలు ఎదురు అయినా…

తిరిగి యమదొంగ, బృందావనం, అదుర్స్ తో గాడిలో పడగా తిరిగి మళ్ళీ ఫ్లాఫ్స్ వెక్కిరించగా టెంపర్ నుండి నాన్ స్టాప్ గా బాక్స్ ఆఫీస్ దగ్గర తన జోరు చూపుతూ ఒక్క ఫ్లాఫ్ లేకుండా మినిమమ్ ఎబో యావరేజ్ మూవీస్ తో బాక్స్ ఆఫీస్ ను ఏలుతున్నాడు ఎన్టీఆర్.

ఈ మధ్యకాలంలో ఎన్టీఆర్ సాధించిన రికార్డులను పరిశీలిస్తే…మొదటి రోజు రెండు రాష్ట్రాల్లో ఇండస్ట్రీ రికార్డ్, రెండు ఏరియాల్లో మొదటి రోజు రెండు సార్లు నాన్ బాహుబలి రికార్డ్, మూడు సార్లు వరుసగా 75 కోట్ల రికార్డ్, 4 సార్లు usa బాక్స్ ఆఫీస్ దగ్గర మినిమమ్ 1.5 మిలియన్ రికార్డ్…

5 సినిమాలుగా ఒక్క ఫ్లాఫ్ లేకుండా సినిమా సినిమా కి రేంజ్ ని పెంచుకుంటూ దూసుకుపోతున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్ సోషల్ మీడియా లో హైయెస్ట్ వ్యూస్ ని సొంతం చేసుకున్న టీసర్, ట్రైలర్ రికార్డ్ తో పాటు ఆడియో రిలీజ్ హైయెస్ట్ వ్యూస్ స్పీచ్ రికార్డ్ ను కూడా సొంతం చేసుకుని చరిత్ర సృష్టించాడు.

ఈ సందర్బంగా ఎన్టీఆర్ కి కాంగ్రాట్స్ తెలియజేస్తూ ఈ స్పెషల్ వీడియో…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here