సూపర్ స్టార్ మహేష్ బాబు లేటెస్ట్ మూవీ సర్కారు వారి పాట సినిమా మూడో వీకెండ్ ని ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో పూర్తీ చేసుకున్న తర్వాత ఇప్పుడు మళ్ళీ వర్కింగ్ డేస్ లోకి ఎంటర్ అయింది. సినిమా 18వ రోజు తెలుగు రాష్ట్రాలలో ఆల్ మోస్ట్ 79 లక్షల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకుని దుమ్ము లేపగా 18 వ రోజు వర్కింగ్ డే అవ్వడంతో సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర….
డ్రాప్స్ ను మరోసారి ఎక్కువగానే సొంతం చేసుకుంది, ఇది కామన్ అయినా సినిమా అందుకోవాల్సిన టార్గెట్ ఇంకా ఉండటంతో సినిమా ఇంకా జోరు చూపించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మొత్తం మీద సినిమా ఈ రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర తెలుగు రాష్ట్రాలలో….
20 లక్షలకు అటూ ఇటూగా షేర్ ని సొంతం చేసుకునే అవకాశం ఉందని చెప్పాలి. ఒకవేళ ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ బాగుంటే 25 లక్షల దాకా వెళ్ళే అవకాశం ఉంది. మొత్తం మీద సినిమా వరల్డ్ వైడ్ గా ఈ రోజు 30 లక్షల లోపు కలెక్షన్స్ ని అందుకోవచ్చు. మరి అఫీషియల్ కలెక్షన్స్ ఇదే రేంజ్ లో ఉంటాయో ఉండవో చూడాలి ఇక.