Home న్యూస్ బందోబస్త్ కలెక్షన్స్: ఫస్ట్ డే 1.5 అనుకుంటే వచ్చింది ఇది….పాపం సూర్య!!

బందోబస్త్ కలెక్షన్స్: ఫస్ట్ డే 1.5 అనుకుంటే వచ్చింది ఇది….పాపం సూర్య!!

0

     తమిళ్ తో పాటు తెలుగు లో కూడా మంచి క్రేజ్ ఉన్న హీరో సూర్య, ఒకప్పుడు సూర్య సినిమాలు అంటే స్టార్ హీరోల రేంజ్ లో హడావుడి ఉండేది, సెవెంత్ సెన్స్ సినిమా అయితే అల్టిమేట్ ఓపెనింగ్స్ ని సొంతం చేసుకుంది, కానీ సరైన సినిమాలు ఎంచుకోవడం లో విఫలం అయిన సూర్య రాను రాను నాసిరకం సినిమాలు చేస్తూ తన క్రేజ్ ని కోల్పోతూ వచ్చాడు. రీసెంట్ గా వచ్చిన…

బందోబస్త్ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి పర్వాలేదు అనిపించే టాక్ ని సొంతం చేసుకున్నా కానీ కలెక్షన్స్ పరంగా తొలిరోజు దిమ్మతిరిగే షాక్ ఇచ్చే వసూళ్లు సాధించింది, తమిళ్ లో తొలిరోజు 7.3 కోట్ల దాకా గ్రాస్ ని వసూల్ చేసి యావరేజ్ ఓపెనింగ్స్ ని అందుకున్న సినిమా…

తెలుగు రాష్ట్రాలలో మినిమం 1.5 కోట్ల నుండి 1.8 కోట్ల రేంజ్ లో కలెక్షన్స్ సాధించడం పక్కా అని అనుకున్నా అందరికీ షాక్ ఇస్తూ ఫస్ట్ డే కేవలం 1.02 కోట్ల షేర్ తోనే సరి పెట్టుకుంది. దాంతో సూర్య ప్రజెంట్ క్రేజ్ తెలుగు లో ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు. ఈ కలెక్షన్స్… రీసెంట్ గా వచ్చిన సూర్య NGK డిసాస్టర్ టాక్ తో కూడా…

రెండు తెలుగు రాష్ట్రాలలో 1.29 కోట్ల షేర్ ని అందుకోగా అంతకన్నా తక్కువగా 1.02 కోట్ల షేర్ ని అందుకోవడం అందరికీ షాక్ కి గురి చేసింది. ఇక అసలు సమస్య సినిమా ను 9 కోట్లకు అమ్మారు, అంటే బ్రేక్ ఈవెన్ అవ్వాలి అంటే 10 కోట్ల షేర్ ని సినిమా సాధించాల్సి ఉంటుంది.

దాంతో బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా ఇప్పుడు ఎలాంటి కలెక్షన్స్ ని అందుకుంటుందో అనే టెన్షన్ మొదలైంది. మంచి సినిమాలతో తెలుగు లో సంపాదించుకున్న మార్కెట్ ని నాసిరకం మూవీస్ తో పోగొట్టుకున్న సూర్య ఇప్పుడు పర్వాలేదు అనిపించే సినిమా చేసినా జనాలు థియేటర్స్ రప్పించలేక పోతున్నాడు. మరి లాంగ్ రన్ లో అయినా సినిమా పుంజుకుంటుందేమో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here