బాక్స్ ఆఫీస్ దగ్గర మహా సముద్రం సినిమా మొదటి రోజు సాధించిన టోటల్ కలెక్షన్స్ లెక్క కొంచం లేట్ గా రిలీజ్ అయింది, దసరా హాలిడే అవ్వడంతో షేర్ వివరాలు బయటికి రాలేదు. కానీ తర్వాత రోజు షేర్ వివరాలు బయటికి రాగా సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి రోజు అంచనాలను అందుకోలేక పోయింది. అంచనా వేసిన కలెక్షన్స్ కి చాలా దూరంగా కలెక్షన్స్ ని సొంతం చేసుకుంది ఈ సినిమా..
మొదటి రోజు తెలుగు రాష్ట్రాలలో 3 కోట్లకు పైగా షేర్ ని సినిమా మినిమం అందుకుంటుందని వరల్డ్ వైడ్ కలెక్షన్స్ లెక్క 3.5 కోట్ల నుండి 4 కోట్ల రేంజ్ లో వస్తుంది అనుకుంటే సినిమా మొదటి రోజు తెలుగు రాష్ట్రాలలో 2.58 కోట్ల షేర్ తోనే సరిపెట్టుకోగా వరల్డ్ వైడ్ కలెక్షన్స్ లెక్క మొత్తం మీద…
2.86 కోట్ల రేంజ్ లో సొంతం చేసుకుంది, ఓవర్సీస్ లో కూడా కుమ్ముతుంది అనుకుంటే ప్రీమియర్స్ అండ్ డే 1 కలెక్షన్స్ తో సినిమా 50K మార్క్ ని మాత్రమె అందుకుంది, తెలుగు రాష్ట్రాలలో మిక్సుడ్ టాక్ వలన ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ కి గట్టి ఎదురుదెబ్బ తగిలింది అని చెప్పాలి.
టోటల్ గా ఫస్ట్ డే ఏరియాల వారి కలెక్షన్స్ ని గమనిస్తే…
👉Nizam: 87L
👉Ceeded: 45L
👉UA: 31L
👉East: 18L
👉West: 14L
👉Guntur: 35L(18L Hires)
👉Krishna: 15L
👉Nellore: 13L
AP-TG Total:- 2.58CR(4.4CR~ Gross)(18L Hires)
Ka+ROI: 10L
OS – 18L
Total WW: 2.86CR(5CR~ Gross)
ఇదీ సినిమా మొదటి రోజు టోటల్ కలెక్షన్స్ లెక్క…
సినిమాను మొత్తం మీద 13.5 కోట్ల రేటు కి అమ్మగా సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 14 కోట్ల టార్గెట్ తో బరిలోకి దిగగా మొదటి రోజు సాధించిన కలెక్షన్స్ కాకుండా సినిమా ఇంకా 11.14 కోట్ల షేర్ ని సొంతం చేసుకోవాల్సి ఉంది. ఇక రెండో రోజు సినిమా కలెక్షన్స్ లెక్క టోటల్ 2 డేస్ కలెక్షన్స్ రిపోర్ట్ లో అప్ డేట్ చేస్తాం…