Home న్యూస్ 1st డే మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ కలెక్షన్స్….5 అనుకుంటే…ఊచకోత కోశాడు!!

1st డే మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ కలెక్షన్స్….5 అనుకుంటే…ఊచకోత కోశాడు!!

3293
0

బాక్స్ ఆఫీస్ దగ్గర అఖిల్ అక్కినేని పూజా హెగ్డే ల కాంబినేషన్ లో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ఫస్ట్ డే అంచనాలను మించి పోయే కలెక్షన్స్ ని బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకుని సంచలన కలెక్షన్స్ తో దుమ్ము దుమారం చేశాడు. సినిమా మొదటి రోజు తెలుగు రాష్ట్రాలలో షో షోకి కలెక్షన్స్ ని పెంచుకుంటూ జోరు చూపగా 4 కోట్లు, 4.5 కోట్లు ఇక 5 కోట్లు మొదటి రోజు…

సినిమా తెలుగు రాష్ట్రాలలో అందుకోవడం ఖాయమని అనుకోగా సినిమా ఆ లెక్కను కూడా మించిపోయి మొదటి రోజు ఏకంగా 5.45 కోట్ల రేంజ్ లో షేర్ ని బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకుని సంచలన రికార్డ్ ను నమోదు చేసింది… ఇక వరల్డ్ వైడ్ గా సినిమా అద్బుతమైన…

కలెక్షన్స్ ని అందుకుంది… అమెరికాలో ప్రీమియర్స్ అండ్ డే 1 కలెక్షన్స్ కలిపి $225K మార్క్ ని అందుకోగా రెస్ట్ ఆఫ్ ఇండియా లో కూడా అదరగొట్టి టోటల్ వరల్డ్ వైడ్ గా 6.8 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకుని సంచలనం సృష్టించింది… సినిమా ఫస్ట్ డే టోటల్ ఏరియాల వారి కలెక్షన్స్ ని గమనిస్తే….

👉Nizam: 2.02Cr
👉Ceeded: 1.12Cr
👉UA: 61L
👉East: 34L
👉West: 30L
👉Guntur: 52L(14L Hires)
👉Krishna: 31L
👉Nellore: 23L
AP-TG Total:- 5.45CR(9.1CR~ Gross)
Ka+ROI: 51L
OS – 84L
Total WW: 6.80CR(11.90CR~ Gross)
ఇదీ సినిమా మొదటి రోజు మొత్తం మీద బాక్స్ ఆఫీస్ దగ్గర సాధించిన టోటల్ కలెక్షన్స్ లెక్క.

సినిమాను టోటల్ వరల్డ్ వైడ్ గా 18.5 కోట్ల రేటు కి అమ్మగా సినిమా 19 కోట్ల టార్గెట్ తో బరిలోకి దిగగా మొదటి రోజు సాధించిన కలెక్షన్స్ కాకుండా మరో 12.2 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకుంటే క్లీన్ హిట్ గా నిలుస్తుంది అని చెప్పాలి. ఇక రెండో రోజు సినిమా బాక్స్ ఆఫీస్ జోరు ఏ విధంగా ఉంటుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here