అఖిల్ అక్కినేని నటించిన లేటెస్ట్ మూవీ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ఆడియన్స్ ముందుకు ఎట్టకేలకు వచ్చేసింది. సినిమా తెలుగు రాష్ట్రాల్లో మొత్తం మీద రిలీజ్ రోజుకి వచ్చే సరికి 550 వరకు థియేటర్స్ లో 100% ఆక్యుపెన్సీ అడ్వాంటేజ్ తో నార్మల్ టికెట్ రేట్స్ తో రిలీజ్ ను సొంతం చేసుకోగా దసరా హాలిడే అడ్వాంటేజ్ కూడా ఉన్న ఈ సినిమా మార్నింగ్ అండ్ మ్యాట్నీ షోల టైం నుండి బాక్స్ ఆఫీస్ రచ్చ స్టార్ట్ చేసింది.
సినిమా తెలుగు రాష్ట్రాలలో మార్నింగ్ అండ్ మ్యాట్నీ షోలకు ఓవరాల్ గా 50-60% రేంజ్ ఆక్యుపెన్సీ తో ఓపెన్ అవ్వడం నిజంగానే మాస్ బ్యాటింగ్ అని చెప్పాలి. నైజాంలో కొంచం స్లో స్టార్ట్ ఉన్నప్పటికే ఆంధ్రలో సాలిడ్ ఓపెనింగ్స్ ని సినిమా దక్కించుకుంది.
సీడెడ్ లాంటి మాస్ ఏరియాలో కూడా 45-50% ఆక్యుపెన్సీని ఓవరాల్ గా సొంతం చేసుకుని ఓపెన్ అయ్యింది ఈ సినిమా, ఇక ఈవినింగ్ అండ్ నైట్ షోల బుకింగ్స్ కూడా అన్ని చోట్ల సాలిడ్ గా కొనసాగుతున్నాయి. మొత్తం మీద ప్రెజెంట్ మార్నింగ్ అండ్ మ్యాట్నీ షోల బుకింగ్స్ ను బట్టి చూస్తుంటే సినిమా మొదటి రోజు…
3.5 కోట్ల నుండి 4 కోట్ల రేంజ్ లో ఓపెనింగ్స్ ను అందుకునే అవకాశాలు ఎంతైనా కనిపిస్తున్నాయి. ఇక ప్రీమియర్ షోలతో సినిమా ఆల్ రెడీ 100K మార్క్ ని అధిగమించగా మొదటి రోజు కలెక్షన్స్ ఎలా ఉంటాయి అన్నది ఆసక్తిగా మారగా తెలుగు రాష్ట్రాలలో..మొదటి రోజు ఈవినింగ్ అండ్ నైట్ షోలకు గ్రోత్ ఇంకా పెరిగే అవకాశం ఉంది కాబట్టి సినిమా…
4 కోట్లకి పైగా షేర్ ని అందుకోవచ్చు…. అంతకుమించి ముందుకు వెళ్ళే అవకాశం కూడా ఎంతైనా ఉంది. ఓవరాల్ గా మొదటి రోజు సాలిడ్ కలెక్షన్స్ ని సినిమా సొంతం చేసుకోబోతుంది. బాక్స్ ఆఫీస్ దగ్గర మొత్తం మీద రోజు ముగిసే సమయానికి సినిమా స్టేటస్ ఎలా ఉంది అన్నది మరో ఆర్టికల్ లో అప్ డేట్ చేస్తాం…
Mahasamudram 1 st day collections pettu bro