బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ వీకెండ్ లో రెండు స్ట్రైట్ మూవీస్ అండ్ ఒక డబ్బింగ్ మూవీ ఆడియన్స్ ముందుకు వచ్చాయి, కార్తికేయ నటించిన రాజా విక్రమార్క సినిమా, ఆనంద్ దేవరకొండ పుష్పక విమానం మరియు దుల్కర్ సల్మాన్ నటించిన కురుప్ సినిమాలు ఓవరాల్ గా 980 థియేటర్స్ లో తెలుగు రాష్ట్రాలలో రిలీజ్ ను సొంతం చేసుకున్నాయి కానీ బాక్స్ ఆఫీస్ దగ్గర నవంబర్ అన్ సీజన్ ఎఫెక్ట్ గట్టిగానే ఉందనిపిస్తుంది.
ఓపెనింగ్స్ విషయంలో రిలీజ్ అయిన రేంజ్ దృశ్యా అన్ని సినిమాలు యావరేజ్ గానే ఓపెన్ అయ్యాయి, బుకింగ్స్ అన్నీ యావరేజ్ గానే ఉండగా మౌత్ టాక్ పైనే డిపెండ్ అయ్యి రిలీజ్ అయిన ఈ సినిమాలలో కార్తికేయ రాజా విక్రమార్క ఉన్నంతలో బెటర్ గా పెర్ఫార్మ్ చేస్తుంది…
మార్నింగ్ అండ్ మ్యాట్నీ షోలకు సినిమా అన్ని చోట్లా 15% రేంజ్ ఆక్యుపెన్సీని సొంతం చేసుకోగా కొన్ని చోట్ల హౌస్ ఫుల్ బోర్డులు కూడా పడ్డాయి. ఇక రోజు గడుస్తున్న కొద్ది డీసెంట్ గానే పెర్ఫార్మ్ చేసిన సినిమా ఉన్నంతలో ఇప్పుడు 40-50 లక్షల రేంజ్ కలెక్షన్స్ ని అందుకోవచ్చు… అన్ని చోట్లా ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు బాగుంటే…
ఓవరాల్ గా 60 లక్షల రేంజ్ కి వెళ్ళే ఔట్ రైట్ ఛాన్స్ కూడా ఉంది. ఇక పుష్పక విమానం కూడా 10% ఆక్యుపెన్సీతో ఓపెన్ అయ్యి కొన్ని చోట్ల ఫుల్స్ పడ్డా ఓవరాల్ గా ఈవినింగ్ షోలకు పర్వాలేదు అనిపించగా మొదటి రోజు ఈ సినిమా 30 లక్షల రేంజ్ కలెక్షన్స్ తో ఓపెన్ అయ్యే ఛాన్స్ ఉండగా ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ బాగుంటే 40 లక్షల రేంజ్ కి వెళ్ళే అవకాశం ఉంది.
ఇక డబ్బింగ్ మూవీ కురుప్ మిగిలిన సినిమాలతో పోల్చితే లోవేస్ట్ ఓపెనింగ్స్ తో ఓపెన్ అవ్వగా సినిమా మొదటి రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర ఇప్పుడు 20 లక్షల రేంజ్ కలెక్షన్స్ ని అందుకునే ఛాన్స్ ఉంది, అది కూడా ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు బాగుంటే అని చెప్పాలి. మరి అన్ని సినిమాల అఫీషియల్ ఫస్ట్ డే బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ వివరాలు ఏ విధంగా ఉంటాయో చూడాలి ఇక.