బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ వీకెండ్ 2 సినిమాలు మేజర్ గా పోటి పడ్డాయి, కంప్లీట్ గా యూత్ ని టార్గెట్ చేసిన రొమాంటిక్ మరియు అర్బన్ యూత్ ని అండ్ ఫ్యామిలీ ఆడియన్స్ ను టార్గెట్ చేసిన వరుడు కావలెను సినిమాలు, ఈ రెండు సినిమాలు కలిపి ఆల్ మోస్ట్ 900 వరకు థియేటర్స్ లో తెలుగు రాష్ట్రాలలో రిలీజ్ అవ్వగా మాస్ ని యూత్ ని టార్గెట్ చేసిన రొమాంటిక్ తొలిరోజు…
బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి ఓపెనింగ్స్ ను అందుకోబోతుంది, మాస్ సెంటర్స్ లో ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ బాగుండగా సినిమా క్లాస్ సెంటర్స్ లో యావరేజ్ ఓపెనింగ్స్ ని సొంతం చేసుకుంది, మొత్తం మీద రోజు ఎండ్ అయ్యే టైం కు 30-35% రేంజ్ లో ఆక్యుపెన్సీని…
సినిమా సొంతం చేసుకోగా… సినిమా మొదటి రోజు ఇప్పుడు 80-90 లక్షల రేంజ్ లో ఓపెనింగ్స్ ని అందుకునే అవకాశం కనిపిస్తుంది, కంప్లీట్ గా ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు బాగుంటే 1 కోటి నుండి 1.1 కోట్ల దాకా షేర్ ని కూడా అందుకోవచ్చు… సినిమా టార్గెట్ దృశ్యా ఇది ఎక్స్ లెంట్ ఓపెనింగ్స్ అని చెప్పాలి.
ఇక వరుడు కావలెను మూవీ పరిస్థితి ఫస్ట్ డే చాలా కష్టంగా ఉంది, క్లాస్ ఆడియన్స్ ను టార్గెట్ చేసినా మార్నింగ్ అండ్ నూన్ షోలకు పెద్దగా ఆడియన్స్ అయితే థియేటర్స్ కి రాలేదు, కానీ ఆడియన్స్ లో సినిమా కి డీసెంట్ గా వచ్చిన నేపధ్యంలో ఈవినింగ్ షోల నుండి కొంచం పుంజుకున్న సినిమా మొత్తం మీద ఫస్ట్ డే తెలుగు రాష్ట్రాల్లో….
70-80 లక్షల రేంజ్ లో కలెక్షన్స్ ని అందుకునే అవకాశం ఉంది, అన్ని చోట్ల ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు బాగుంటే ఈ లెక్క 90-1 కోటి రేంజ్ కి వెళ్ళే అవకాశం ఉంది, కానీ సినిమా అందుకోవాల్సిన టార్గెట్ దృశ్యా ఈ ఓపెనింగ్స్ ఏమాత్రం సరిపోవు అనే చెప్పాలి. మరి మొత్తం మీద మొదటి రోజు 2 సినిమాలు ఎలాంటి కలెక్షన్స్ ని సొంతం చేసుకుంటాయో చూడాలి.