బాక్స్ ఆఫీస్ దగ్గర యాక్షన్ హీరో విశాల్ నటించిన లేటెస్ట్ మూవీ సామాన్యుడు తెలుగు లో ఎలాంటి పోటి లేకుండా ఆల్ మోస్ట్ 580 వరకు థియేటర్స్ లో రిలీజ్ ను సొంతం చేసుకుంది. సినిమా ట్రైలర్ ప్రామిసింగ్ గా ఉన్నప్పటికీ కూడా పెద్దగా మేకర్స్ సినిమాను ప్రమోట్ చేయలేదు… ఆ ఇంపాక్ట్ తో పాటు అన్ సీజన్ ఎఫెక్ట్ కూడా ఒక కారణం అవ్వడంతో బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా మొదటి రోజు….
ఏమాత్రం అనుకున్న రేంజ్ లో ఓపెన్ అవ్వలేక పోయింది… సినిమా టాక్ కూడా మిక్సుడ్ గా ఉండటంతో కలెక్షన్స్ పరంగా సినిమా మొదటి రోజు అంచనాలను తప్పింది. సినిమా తొలిరోజు 40 లక్షల నుండి 45 లక్షల రేంజ్ కి వెళ్ళే అవకాశం ఉందని భావించినా కానీ….
ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ బాగుంటే 50 లక్షల నుండి 55 లక్షలకు వెళుతుంది అనుకున్నా సినిమా బిజినెస్ దృశ్యా 1 కోటి రేంజ్ లో ఓపెన్ అవ్వాల్సిన అవసరం ఉన్న సినిమా మొత్తం మీద మొదటి రోజు రెండు తెలుగు రాష్ట్రాలలో 40 లక్షల రేంజ్ లో కలెక్షన్స్ ని మాత్రమే సొంతం చేసుకుని ఓపెన్ అయ్యింది.
👉Nizam: 9L
👉Ceeded: 8L
👉UA: 6L
👉East: 5L
👉West: 3L
👉Guntur: 4L
👉Krishna: 3L
👉Nellore: 2L
AP-TG Total:- 40L(0.70CR~ Gross)
ఇదీ మొత్తం మీద సినిమా మొదటి రోజు రెండు తెలుగు రాష్ట్రాలలో సాధించిన ట్రేడ్ లెక్కల్లో కలెక్షన్స్ వివరాలు. సినిమాను మొత్తం మీద 5.1 కోట్ల రేటు కి అమ్మగా సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 5.5 కోట్ల రేంజ్….
టార్గెట్ తో బరిలోకి దిగగా మొత్తం మీద మొదటి రోజు సాధించిన కలెక్షన్స్ కాకుండా బాక్స్ ఆఫీస్ దగ్గర ఇంకా 5.1 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకోవాల్సి ఉంటుంది, మొదటి రోజు అనుకున్న అంచానాలను అందుకోలేక పోయిన సామాన్యుడు సినిమా మిగిలిన రెండు రోజుల వీకెండ్ లో కలెక్షన్స్ పరంగా గ్రోత్ ని చూపెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పాలి.