టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి నటించిన సెన్సేషనల్ 151 వ సినిమా సైరా నరసింహా రెడ్డి బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ ఎత్తున నేడు రిలీజ్ అవ్వగా సినిమా ఓవర్సీస్ ప్రీమియర్ షో లతో అలాగే మార్నింగ్ షోలకు అద్బుతమైన రెస్పాన్స్ ని సొంతం చేసుకుంది. ఇక సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఓపెనింగ్స్ ఏ విధంగా ఉంటాయి అన్నవి ఆసక్తిగా మారింది. రెండు తెలుగు రాష్ట్రాలలో సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ స్లో గా మొదలు అవ్వగా…
రిలీజ్ కి ఒక రోజు ముందు వరకు 60% కి పైగా ఉన్న బుకింగ్స్ ఈ రోజు మార్నింగ్ అండ్ మ్యాట్నీ షోల కి వచ్చే సరికి 80% టు 85% వరకు ఆక్యుపెన్సీ తో రన్ అయ్యింది. చాలా ఏరియాల్లో అద్బుతమైన గ్రోత్ తో సినిమా జోరు కొనసాగుతుంది. దాంతో సినిమా…
ఈవినింగ్ అండ్ నైట్ షోలలో కూడా ఇదే ట్రెండ్ ని కొనసాగించే అవకాశం పుష్కలంగా ఉందని చెప్పొచ్చు. అన్నీ అనుకున్నట్లు జరిగితే ఈవినింగ్ అండ్ నైట్ షోల సమయానికి ఓవరాల్ గా 90% నుండి 95% వరకు ఆక్యుపెన్సీ తో సినిమా రన్ అయ్యే అవకాశం ఉంది. దాంతో సినిమా రెండు తెలుగు రాష్ట్రాలలో 30 కోట్లకు పైగా ఓపెనింగ్స్ ని అందుకోవచ్చు.
ఇక హిందీ వర్షన్ స్లో స్టార్ట్ ని సొంతం చేసుకుంది, బుకింగ్స్ లేట్ గా ఓపెన్ అవ్వడం పోటి లో వార్ అండ్ జోకర్ ఉండటం తో సినిమా ఎఫెక్ట్ అయింది, కానీ టాక్ బాగుండటం తో అక్కడ సినిమా మొదటి రోజు 4 నుండి 5 కోట్ల రేంజ్ నెట్ కలెక్షన్స్ ని అందుకోవచ్చు.
ఇక కర్ణాటక లో సినిమా ఓపెనింగ్స్ సాలిడ్ గా ఉండగా తొలిరోజు అక్కడ సినిమా 5 నుండి 6 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోవచ్చని అంచనా వేస్తున్నారు. ఇక తమిళ్, మలయాళం ఇతర చోట్లా యావరేజ్ బుకింగ్స్ తోనే సరిపెట్టుకున్న సినిమా 2 కోట్లకు పైగా షేర్ అందుకోవచ్చు.
ఇక సినిమా ఓవర్సీస్ ప్రీమియర్ షోలతో 0.8 మిలియన్ మార్క్ ని అందుకుంది, ఫైనల్ లెక్కలు ఇంకా తేలాల్సి ఉంది, మొత్తం మీద అన్ని చోట్లా కలెక్షన్స్ తో మొదటి రోజు మెగా హిస్టారికల్ రికార్డులను నమోదు చేసే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి.
ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ ని బట్టి మొత్తం మీద మొదటి రోజు కలెక్షన్స్ లెక్కలలో ఈవినింగ్ అండ్ నైట్ షోల గ్రోత్ బాగుంటే అనుకున్న రేంజ్ కి మించి వసూళ్ళ ని సినిమా రాబట్ట వచ్చు. మరి రోజు ముగిసే సరికి సినిమా స్టేటస్ ఎలా ఉంటుందో చూడాలి.
మొత్తం మీద మొదటి రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర మెగాస్టార్ చిరంజీవి మరో సారి తన రేంజ్ ఏంటో చూపుతూ టాలీవుడ్ హిస్టరీ లోనే వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ ని సొంతం చేసుకోబోతున్నాడు అన్నది మాత్రం కన్ఫాం అని చెప్పొచ్చు. న్యూస్ అప్ డేట్స్ కోసం బెల్ ఐకాన్ ని ప్రెస్ చేసి సబ్ స్బైబ్ చేసుకోండి.. అప్ డేట్ రాగానే నోటిఫికేషన్ మీకు అందుతుంది.