Home న్యూస్ 100 కోట్ల సినిమా ఫస్ట్ డే (కర్ణాటక & తెలుగు)కలెక్షన్స్ రిపోర్ట్!!

100 కోట్ల సినిమా ఫస్ట్ డే (కర్ణాటక & తెలుగు)కలెక్షన్స్ రిపోర్ట్!!

0

     100 కోట్ల బడ్జెట్ తో అత్యంత భారీ ఎత్తున తెరకెక్కించిన మైతలాజికల్ మహాభారతం “కురుక్షేత్రం” రీసెంట్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది, సినిమా కన్నడ లో రూపొందించినా కానీ తెలుగు లో కూడా భారీ ఎత్తున రిలీజ్ చేశారు, కాగా సినిమా రెండు భాషల పూర్తి బిజినెస్ వివరాలు తెలియ రాలేదు కానీ కర్ణాటక లో మాత్రం 45 కోట్ల రేంజ్ దాకా బిజినెస్ ని ఈ సినిమా సొంతం చేసుకుందని టాక్ ఉంది.

కానీ తెలుగు లో సినిమా బిజినెస్ వివరాలు ఇంకా రిలీజ్ అవ్వలేదు, ఇక బాక్స్ ఆఫీస్ పెర్ఫార్మెన్స్ విషయానికి వస్తే ఈ సినిమా మొదటి రోజు కర్ణాటక లో 8 నుండి 10 కోట్ల మధ్యలో గ్రాస్ ని వసూల్ చేసిందని సమాచారం. ఇది అక్కడ KGF తర్వాత సెకెండ్ బెస్ట్ ఓపెనర్ అంటున్నారు.

KGF అక్కడ ఫస్ట్ డే 12 కోట్లకు పైగానే గ్రాస్ ని వసూల్ చేసింది, ఇప్పుడు కురుక్షేత్ర సినిమా అక్కడ 8 నుండి 10 కోట్ల మధ్యలో గ్రాస్ ని 5 కోట్ల మేర షేర్ ని అందుకుందని సమచారం. ఇక తెలుగు రాష్ట్రాలలో సినిమా బిజినెస్ తెలియకున్నా మొదటి రోజు పెద్దగా ప్రమోషన్ లాంటివి లేకుండానే సినిమా…

45 లక్షల దాకా షేర్ ని వసూల్ చేసినట్లు సమాచారం, ఇది మంచి ఓపెనింగ్స్ అనే చెప్పాలి, ఎలాంటి టాక్ బాగానే ఉంది కాబట్టి సినిమా రానున్న రోజుల్లో కలెక్షన్స్ పరంగా మరింత జోరు చూపే అవకాశం ఉంది, తెలుగు లో కొంచం ప్రమోషన్ పనులను పెంచితే సినిమా ఎక్కువ మందికి రీచ్ అవుతుంది.

తెలుగు క్లాసిక్ హిట్ దానవీరశూరకర్ణ సినిమా స్పూర్తిగా తెరకెక్కిన ఈ సినిమా 100 కోట్ల రేంజ్ బడ్జెట్ తో రూపొందినా కానీ ఆ రేంజ్ బిజినెస్ ని సొంతం చేసుకోలేదు, కానీ శాటిలైట్ రైట్స్ హక్కులు డబ్బింగ్ శాటిలైట్ రైట్ హక్కులతో సినిమా నిర్మాతలకు సేఫ్ వెంచర్ గానే ఉందని అంటున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here