Home గాసిప్స్ 100 కోట్ల సినిమా…కురుక్షేత్రం తెలుగు రివ్యూ!!

100 కోట్ల సినిమా…కురుక్షేత్రం తెలుగు రివ్యూ!!

1509
0

    కన్నడ చరిత్రలో అత్యధిక బడ్జెట్ తో రూపొంచిన అతి కొద్ది సినిమాల్లో కురుక్షేత్ర సినిమా ఒకటి, రీసెంట్ గా సినిమా కన్నడ తో పాటు తెలుగు లో కూడా రిలీజ్ అయ్యింది, సినిమా తెలుగు లో పెద్దగా ప్రమోషన్ ని చేయలేదు కానీ భారీగానే రిలీజ్ చేశారు, ఇక సినిమా టాక్ విషానికి వస్తే పాండవులు కౌరవుల మధ్య మహాభారతం కథ నే షార్ట్ గా చెప్పే ప్రయత్నం చేశారు ఈ సినిమాలో…

అయినా కానీ లెంత్ 3 గంటలు దాటినా ఇలాంటి మైతలాజికల్ హిస్టారికల్ మూవీస్ ని నేటి యూత్ పెద్దగా చూసి ఉండరు కాబట్టి ఆ ఎక్స్ పీరియన్స్ ని థియేటర్స్ లో చూస్తె చాలా భాగా అనిపించింది అని చెప్పొచ్చు. భారీ తారాగణం తో తెరకెక్కిన ఈ సినిమా…

కన్నడ సినిమా అవ్వడం తో అక్కడ నటీనటులతో నిండి పోయినా మనకు తెలిసిన నటీనటులు కూడా సినిమాలో బాగానే ఉన్నారు, వారి పెర్ఫార్మెన్స్ కూడా ఆకట్టుకుందని చెప్పొచ్చు. సినిమా లెంత్ అక్కడక్కడా ఎక్కువ అయిందని అనిపించినా కానీ ఇలాంటి భారీ స్టార్ కాస్ట్ ఉన్న సినిమా కి అలాంటి లెంత్ ఉండక తప్పదు అని చెప్పొచ్చు.

కురుక్షేత్రం తెలుగు ఆడియన్స్ మనసు గెలిచే అవకాశం ఎక్కువగా ఉన్న సినిమా అని చెప్పాలి, కానీ మరింత ప్రమోషన్ చేస్తే జనాల్లో మరింత ఎక్కువగా రీచ్ అయ్యే అవకాశం ఉంది, కథ కథనం అన్ని మైతలాజికల్ మూవీస్ లో ఎలా ఉంటాయో అలానే ఉంటాయి కానీ డైలాగ్స్ ని మాత్రం కొంచం నేటి భాష కి తగ్గట్లు పెట్టారు.

అయినా కానీ సినిమా బాగుందని చెప్పొచ్చు. టీవి లలో మైతలాజికల్ మహాభారతం కి సంభందించిన సినిమాలు చూసిన వారు వెండి తెరపై ఈ సినిమా ను చూసి కచ్చితంగా థ్రిల్ ఫీల్ అవ్వడం ఖాయం, 3D అంత ఎఫెక్టివ్ గా లేకపోవడం ఒక్కడే సినిమాకి ఒక మైనస్ పాయింట్, అది తప్పితే సినిమా ఉన్నంతలో బాగా తెరకెక్కించారు. ఇలాంటి సినిమాలకు రేటింగ్ ఇవ్వడం ఆ సినిమాలను కించపరచడం అవుతుంది కాబట్టి ఇవ్వడం లేదు…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here