బాక్స్ ఆఫీస్ దగ్గర పాన్ ఇండియా రేంజ్ లో భారీ వసూళ్ళతో భీభత్సం సృష్టిస్తుంది అని అనుకున్న కోలివుడ్ స్టార్ హీరో సూర్య(Suriya) నటించిన లేటెస్ట్ మూవీ కంగువ(Kanguva) సినిమా రీసెంట్ గా రిలీజ్ అయ్యి మొదటి రోజే ఏమాత్రం అంచనాలను అందుకోలేక డిసాస్టర్ టాక్ ను సొంతం చేసుకోగా తర్వాత ఏ దశలో కూడా…
వాల్యూ టార్గెట్ మినిమమ్ న్యాయం కూడా చేయలేక పోయింది….సినిమా మొదటి రోజే 100 కోట్ల రేంజ్ లో ఓపెనింగ్స్ తో లెక్క స్టార్ట్ అవుతుంది అని రిలీజ్ కి ముందు ఎక్స్ పెర్ట్ చేసినా కూడా మొదటి వారంలో కూడా ఈ మార్క్ ని ఏమాత్రం అందుకోలేక పోయింది ఇప్పుడు.
సినిమా 7వ రోజున తెలుగు రాష్ట్రాల్లో 25 లక్షల రేంజ్ లో షేర్ మార్క్ ని అందుకోగా వరల్డ్ వైడ్ గా సినిమా 2 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను అందుకుని మరింతగా డ్రాప్ అయింది. ఇక 95 లక్షల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకుని మొదటి వారాన్ని కంప్లీట్ చేసుకుంది.
సినిమా మొత్తం మీద మొదటి వారంలో తెలుగు రాష్ట్రాల్లో సాధించిన టోటల్ కలెక్షన్స్ ని గమనిస్తే…
Kanguva Movie 7 Days Telugu States Collections (Inc GST)
👉Nizam: 3.44Cr~
👉Ceeded: 1.18Cr~
👉Andhra: 3.74Cr~
AP-TG Total:- 8.36CR(14.60Cr~ Gross)
25 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ ని అందుకోవాలి అంటే సినిమా 16.64 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోవాల్సి ఉంటుంది.
ఇక సినిమా మొదటి వారంలో టోటల్ వరల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే…
Kanguva Movie 7 Days Total World Wide Collections Approx
👉Tamilnadu – 29.35Cr
👉Telugu States – 14.60Cr
👉Karnataka – 4.60Cr
👉Kerala – 6.15Cr
👉Hindi+ROI – 14.00Cr
👉Overseas – 22.80Cr***approx
Total WW collection – 91.50CR(43.95CR~ Share) Approx
మొత్తం మీద 180 కోట్ల వాల్యూ తార్గేత్ను అందుకోవాలి అంటే సినిమా ఇంకా 136 కోట్లకు పైగా షేర్ ని అందుకోవాల్సిన అవసరం ఉండగా సినిమా రెండో వారంలో ఊహకందని రేంజ్ లో హోల్డ్ చూపించకుంటే ఎపిక్ లాసులు కన్ఫాం అనే చెప్పాలి. ఇక మిగిలిన రన్ లో ఎలాంటి కలెక్షన్స్ ని అందుకుంటుందో చూడాలి.