బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా వచ్చిన లేటెస్ట్ మూవీ రాక్షసుడు బాక్స్ ఆఫీస్ దగ్గర మొత్తం మీద మొదటి వారాన్ని పూర్తి చేసుకుంది, సినిమా అల్ట్రా పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకున్నా కానీ బాక్స్ ఆఫీస్ దగ్గర ఆ టాక్ రేంజ్ లో కలెక్షన్స్ ని అందుకోవడం లో మాత్రం విఫలం అయ్యింది ఈ సినిమా, 6 రోజుల్లో మొత్తం మీద 8.8 కోట్ల వరకు షేర్ ని వసూల్ చేసిన సినిమా 7 వ రోజున రెండు తెలుగు రాష్ట్రాలలో…
40 లక్షల దాకా షేర్ ని వసూల్ చేయగా వరల్డ్ వైడ్ గా 42 లక్షల రేంజ్ లో షేర్ ని రాబట్టింది, దాంతో మొదటి వారం ముగిసే సరికి రెండు తెలుగు రాష్ట్రాలలో సినిమా 8.33 కోట్ల షేర్ మార్క్ ని అందుకోగా వరల్డ్ వైడ్ గా 9.27 కోట్ల షేర్ ని వసూల్ చేసింది,
టోటల్ వరల్డ్ వైడ్ గ్రాస్ 17 కోట్ల లోపు ఉంది, సినిమా ను టోటల్ గా 16.2 కోట్లకు అమ్మగా 17.2 కోట్ల టార్గెట్ తో బరిలోకి దిగిన సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఇప్పటి వరకు సాధించిన షేర్ ని పక్కకు పెడితే ఇక నుండి మరో 7.93 కోట్ల షేర్ ని అందుకోవాల్సి ఉంటుంది.
కానీ సినిమా ప్రస్తుత పరిస్థితి ని చూస్తుంటే అది కష్టంగానే కనిపిస్తుంది, ఈ వారం మూడు కొత్త సినిమాలు రిలీజ్ అవ్వడం సినిమా థియేటర్స్ కౌంట్ ని తగ్గేలా చేసింది, డానికి తోడూ సినిమా మాస్ సెంటర్స్ లో అనుకున్న రేంజ్ లో పెర్ఫార్మ్ చేయలేక పోతుంది. దాంతో సినిమా ఫైనల్ రన్ లో…
ఇప్పుడు 12 కోట్ల రేంజ్ కలెక్షన్స్ లోపే కలెక్షన్స్ ని అందుకోవచ్చని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. కానీ సినిమా యావరేజ్ రేటింగ్ 3 స్టార్ రేంజ్ లో ఉండటం ఇంత తక్కువ కలెక్షన్స్ తో మొదటి వారం ముగించడం ఒకింత నిరాశ పరించింది అని చెప్పొచ్చు. మరి రెండో వారం లో అయినా సినిమా ఏదైనా అద్బుతం చేస్తుందో చూడాలి.