Home న్యూస్ భీమా 1st డే టోటల్ కలెక్షన్స్….మాస్ కుమ్ముడు ఇది….కానీ!!

భీమా 1st డే టోటల్ కలెక్షన్స్….మాస్ కుమ్ముడు ఇది….కానీ!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర మాచో స్టార్ గోపీచంద్(Gopichand) నటించిన లేటెస్ట్ మూవీ భీమా(Bhimaa Movie) రీసెంట్ గా రిలీజ్ అవ్వగా సినిమాకి ఆడియన్స్ నుండి మిక్సుడ్ రెస్పాన్స్ సొంతం అయ్యింది, అయినా కూడా మాస్ సెంటర్స్ లో సినిమా మంచి ఓపెనింగ్స్ ను మొదటి రోజు సొంతం చేసుకుని దుమ్ము లేపింది…

ఇప్పటికీ ఆఫ్ లైన్ లో గోపీచంద్ మూవీస్ కి మంచి ఓపెనింగ్స్ వస్తాయని ఈ సినిమా నిరూపించగా ఓవరాల్ గా టాక్ మిక్సుడ్ గా ఉండటం మాత్రం సినిమా లాంగ్ రన్ పై ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉందని చెప్పాలి. మొత్తం మీద మొదటి రోజున సినిమా తెలుగు రాష్ట్రాల్లో 1.5 కోట్ల దాకా ఓపెనింగ్స్ ను….

అందుకోవచ్చు అనుకున్నా కూడా సినిమా మొత్తం మీద 2.08 కోట్ల దాకా ఓపెనింగ్స్ ను బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకోగా వరల్డ్ వైడ్ గా 2.33 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకుంది. ఓవరాల్ గా రెస్ట్ ఆఫ్ ఇండియా ఓవర్సీస్ లో పూర్ స్టార్ట్ ను సొంతం చేసుకున్న సినిమా వరల్డ్ వైడ్ గా….

మొదటి రోజు సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే.. 
Bhimaa 1st Day Box Office Collections Report
👉Nizam: 0.76CR~
👉Ceeded – 0.44CR~
👉Total AP: 0.88CR~
Total AP-TG Collections:- 2.08CR~(3.75CR~ Gross)
👉KA+ROI+OS: 0.25CR~
Total WW Collections- 2.33CR(4.25CR~ Gross)

మొత్తం మీద సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 12 కోట్ల రేంజ్ లో బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగగా మొదటి రోజు సాధించిన కలెక్షన్స్ కాకుండా బ్రేక్ ఈవెన్ కోసం ఇంకా 9.67 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇక మిగిలిన వీకెండ్ లో సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఎలాంటి కలెక్షన్స్ ని అందుకుంటుందో చూడాలి ఇప్పుడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here