విశ్వక్ సేన్ నటించిన లేటెస్ట్ మూవీ దాస్ కా ధమ్కీ సినిమా వరల్డ్ వైడ్ గా భారీగా రిలీజ్ అవ్వగా సినిమా ఓవర్సీస్ లో ఎక్స్ లెంట్ స్టార్ట్ ని సొంతం చేసుకోగా సినిమా తెలుగు రాష్ట్రాల్లో ఉగాది పండగ అడ్వాంటేజ్ తో మంచి స్టార్ట్ ను సొంతం చేసుకుంది. విశ్వక్ సేన్ కెరీర్ లో ది బెస్ట్ అనిపించే రేంజ్ లో ఓపెనింగ్స్ ని అందుకుంటూ దూసుకు పోతున్న సినిమా…
నైజాంలో ఎక్స్ లెంట్ స్టార్ట్ ను అందుకోగా… ఆంధ్ర సీడెడ్ ఏరియాలలో కూడా డీసెంట్ నంబర్ ఆఫ్ ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ తో దూసుకు పోతుంది. దాంతో సినిమా ఇప్పుడు బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి రోజు 1.7 కోట్లకు పైగానే కలెక్షన్స్ ని సొంతం చేసుకోవడానికి సిద్దం అవుతుంది.
అన్ని చోట్లా ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు బాగుంటే సినిమా 1.8 కోట్ల రేంజ్ నుండి 2 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం కనిపిస్తూ ఉండగా ఫైనల్ ఆఫ్ లైన్ లెక్కలు అంచనాలను మించిపోతే సినిమా 2.25 కోట్ల మార్క్ ని కూడా అందుకునే ఔట్ రైట్ ఛాన్స్ ఉంది…
ఓవరాల్ గా ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ అంచనాలను అందుకోకపోతే తప్పితే సినిమా అద్బుతమైన స్టార్ట్ ను సొంతం చేసుకోబోతుంది ఇప్పుడు. ఇక వరల్డ్ వైడ్ గా సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 2.8 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం ఉంది. ఇక ఫస్ట్ డే కలెక్షన్స్ అఫీషియల్ గా ఇదే విధంగా ఉంటాయో ఉండవో చూడాలి.