Home న్యూస్ 1st డే విజయ్ “గోట్” టోటల్ కలెక్షన్స్….మాస్ భీభత్సం ఇది!!

1st డే విజయ్ “గోట్” టోటల్ కలెక్షన్స్….మాస్ భీభత్సం ఇది!!

0

రిలీజ్ కి ముందు పెద్దగా బజ్ ఏమి లేక పోయినా కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర ఒక్కసారి రిలీజ్ అయిన తర్వాత టాక్ కి అతీతంగా రిమార్కబుల్ కలెక్షన్స్ తో అన్ని చోట్లా ఊచకోత కోస్తూ సెన్సేషనల్ ఓపెనింగ్స్ ను సొంతం చేసుకుంది కోలివుడ్ టాప్ హీరో దళపతి విజయ్(Thalapathy Vijay) నటించిన లేటెస్ట్ మూవీ గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం(G.O.A.T Movie)…

తెలుగు రాష్ట్రాల్లో కొంచం అంచనాలను అందుకోవడంలో వెనకడు వేసినా కూడా ఓవరాల్ గా సినిమా వరల్డ్ వైడ్ గా మాత్రం కుమ్మేసింది. మొదటి రోజు తెలుగు లో 3 కోట్లకు పైగా షేర్ వస్తుంది అనుకున్నా అలా జరగలేదు. ఓవరాల్ గా 2.24 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకుంది..

ఫస్ట్ డే కలెక్షన్స్ లెక్కలను గమనిస్తే… 
The Greatest Of All Time Movie 1st Day Telugu States Collections
👉Nizam: 1.01Cr~
👉Ceeded: 34L~
👉Andhra: 88L~
AP-TG Total:- 2.23CR(3.80Cr~ Gross)

The Greatest Of All Time 1st Day Total WW Collections!!

తెలుగులో సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 22 కోట్లతో బరిలోకి దిగగా బ్రేక్ ఈవెన్ కోసం ఇంకా 20 కోట్ల లోపు షేర్ ని అందుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇక వరల్డ్ వైడ్ గా మొదటి రోజు అంచనాలను అందుకుంటూ 100 కోట్ల మార్క్ ని దాటేసింది సినిమా…

మొత్తం మీద మొదటి రోజు వరల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే… 
The Greatest Of All Time 1st Day Total World Wide Collections Approx
👉Tamilnadu – 31.65Cr
👉Telugu States – 3.80Cr
👉Karnataka – 10.15Cr
👉Kerala – 5.80Cr
👉ROI – 4.00Cr
👉Overseas – 49.35Cr***approx
Total WW collection – 104.75Cr(51.80CR~ Share) Approx

మొత్తం మీద వరల్డ్ వైడ్ గా సినిమా 187 కోట్ల రేంజ్ లో బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగగా మొదటి రోజు సాధించిన కలెక్షన్స్ కాకుండా క్లీన్ హిట్ కోసం ఇంకా 135 కోట్లకు పైగా షేర్ ని అందుకోవాల్సిన అవసరం ఉంది. ఇక సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర వీకెండ్ లో ఎలాంటి కలెక్షన్స్ ని అందుకుంటుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here