Home న్యూస్ 1st డే విజయ్ గోట్ మూవీ కలెక్షన్స్…లో బజ్ తో ప్రకంపనలు సృష్టించిన దళపతి!!

1st డే విజయ్ గోట్ మూవీ కలెక్షన్స్…లో బజ్ తో ప్రకంపనలు సృష్టించిన దళపతి!!

0
The Greatest Of All Time Movie 1st day Box Office collections Update
The Greatest Of All Time Movie 1st day Box Office collections Update

సినిమా సినిమాకి తన రేంజ్ ని పెంచుకుంటూ యావరేజ్ టు ఎబో యావరేజ్ రేంజ్ మూవీస్ తో కూడా సెన్సేషనల్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుంటూ దూసుకు పోతున్న కోలివుడ్  టాప్ హీరో దళపతి విజయ్(Thalapathy Vijay) నటించిన లేటెస్ట్ మూవీ గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం(G.O.A.T Movie 1st Day Collections) సినిమా గ్రాండ్ గా రిలీజ్ అవ్వగా…

తమిళ్ లో ఎక్స్ లెంట్ టాక్ ను సొంతం చేసుకోగా మిగిలిన చోట్ల పర్వాలేదు అనిపించే రేంజ్ లో రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది. ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర ఓపెనింగ్స్ పరంగా సినిమా అన్ని చోట్లా సాలిడ్ కలెక్షన్స్ ని అందుకుంటూ ఉండగా తెలుగు లో మరీ లియో రేంజ్ లో అయితే బుకింగ్స్ లేవు కానీ…

ఉన్నంతలో విజయ్ వారసుడు మూవీ రేంజ్ లో బుకింగ్స్ ఉండగా ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు కూడా పర్వాలేదు అనిపించేలా ఉండటంతో మొదటి రోజు తెలుగు రాష్ట్రాల్లో 2.5 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం ఉండగా ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలను బట్టి…

కలెక్షన్స్ కొంచం అటూ ఇటూగా ఉండే అవకాశం ఉంది. ఇక తమిళనాడులో సెన్సేషనల్ జోరు చూపెడుతున్న సినిమా 30 కోట్లకి పైగా ఓపెనింగ్స్ ను అందుకునే అవకాశం ఎంతైనా ఉండగా ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు అంచనాలను మించితే లెక్క ఇంకా పెరగడం ఖాయమని చెప్పాలి.

ఇక కర్ణాటక, కేరళ రెస్ట్ ఆఫ్ ఇండియాలో మరీ లియో రేంజ్ లో కాక పోయినా కూడా ఉన్నంతలో మంచి జోరునే చూపెడుతుంది. దాంతో ఇండియాలోనే సినిమా మొదటి రోజు 50-55కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ ని అందుకునే అవకాశం ఉండగా ఫైనల్ లెక్కలు బాగుంటే…

55కోట్ల నుండి ఆ పైన కూడా వెళ్ళొచ్చు…ఇక ఓవర్సీస్ లో విజయ్ మరోసారి తన మాస్ స్టామినాని చూపెడుతూ ఉండగా టోటల్ వరల్డ్ వైడ్ గా సినిమా మొదటి రోజు 90-95 కోట్లకు అటూ ఇటూగా గ్రాస్ ను అందుకునే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి.

లో బజ్ ఉన్న మూవీ తో ఇలాంటి ఓపెనింగ్స్ ను అందుకునే విజయ్ మాస్ పవర్ ఏ రేంజ్ లో ఉందో అర్ధం చేసుకోవచ్చు. ఒకవేళ సినిమా 100-105కోట్ల రేంజ్ దాకా వెళితే అది మాస్ భీభత్సం అనే చెప్పాలి ఇప్పుడు. ఇక ఫస్ట్ డే సినిమా అఫీషియల్ కలెక్షన్స్ ఎలా ఉంటాయో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here