టాలీవుడ్ లో రీసెంట్ టైంలో రిలీజ్ అయిన పెద్ద సినిమాలు అన్నీ కూడా బాగానే పెర్ఫార్మ్ చేస్తున్నాయి…ఒక్క గేమ్ చేంజర్ మూవీ ఒక్కటి రీసెంట్ టైంలో అంచనాలను అందుకునే విషయంలో విఫలం అవ్వగా మిగిలిన టాప్ స్టార్ మూవీస్ అన్నీ కూడా తెలుగు రాష్ట్రాల్లో సాలిడ్ కలెక్షన్స్ ని సొంతం చేసుకున్నాయి…లేటెస్ట్ గా సంక్రాంతి కానుకగా ఆడియన్స్ ముందుకు వచ్చిన….
విక్టరీ వెంకటేష్(Victory Venkatesh) అనిల్ రావిపూడి ల సంక్రాంతికి వస్తున్నాం(Sankranthiki Vasthunam Movie) ఊరమాస్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుని మొదటి వారంలో అల్టిమేట్ కలెక్షన్స్ ని సాధించింది…సినిమా నాన్ స్టాప్ గా ప్రతీ రోజూ అంచనాలను మించి పోగా ఓవరాల్ గా మొదటి వారంలో..
తెలుగు రాష్ట్రాల నుండే ఏకంగా 89.5 కోట్లకు పైగా షేర్ ని రాబట్టింది…ఫస్ట్ డే రీసెంట్ టాప్ స్టార్ మూవీస్ రేంజ్ లో సాలిడ్ ఓపెనింగ్స్ కనుక సొంతం అయ్యి ఉంటే ఊహకందని రికార్డులు ఇంకా ఎన్నో నమోదు అయ్యి ఉండేవి. అయినా కూడా సినిమా ఫస్ట్ వీక్ లో తెలుగు రాష్ట్రాల్లో సాధించిన కలెక్షన్స్…
టాలీవుడ్ చరిత్రలో మొదటి వారంలో ఆల్ టైం హైయెస్ట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకున్న మూవీస్ లో టాప్ 7 ప్లేస్ ను సొంతం చేసుకుని మెంటల్ మాస్ జాతర సృష్టించింది….సినిమాకి ఓపెనింగ్స్ బాగుంటాయి అని తెలిసినా మరీ ఈ రేంజ్ లో ఊచకోత కోస్తుంది అని అయితే ఎవ్వరూ ఊహించలేదు…
ఒకసారి ఫస్ట్ వీక్ లో టాలీవుడ్ లో ఆల్ టైం హైయెస్ట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకున్న సినిమాలను గమనిస్తే…
Tollywood AP TG 1st week Highest share Movies
👉#RRR- 187.65CR
👉#Pushpa2TheRule- 161.90CR
👉#Kalki – 135.32CR
👉#SALAAR- 128.54Cr
👉#Devara- 122.45CR
👉#Baahubali2- 117.92Cr
👉#SankranthikiVasthunam – 89.55CR*******
👉#AVPL- 88.25Cr
👉#SarileruNeekevvaru– 84.82Cr
👉#Syeraa- 84.49Cr
👉#GunturKaaram- 81.31Cr
👉#WaltairVeerayya- 79.86CR
👉#SarkaruVaariPaata- 78.90Cr
👉#AdiPurush – 75.27CR
👉#Saaho– 74.92Cr
ఇవి మొత్తం మీద ఫస్ట్ వీక్ లో ఆల్ టైం హైయెస్ట్ కలెక్షన్స్ ని సాధించిన సినిమాలు. బిగ్ పాన్ ఇండియా మూవీస్ తర్వాత ప్లేస్ లో సంక్రాంతికి వస్తున్నాం ఎపిక్ రాంపెజ్ ను చూపించింది. ఇక లాంగ్ రన్ లో సినిమా మరిన్ని అద్బుతాలు నమోదు చేసే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి ఇప్పుడు…