బాక్స్ ఆఫీస్ దగ్గర విజయ్ దేవరకొండ(Vijay Deverakonda) నటించిన లేటెస్ట్ మూవీ ది ఫ్యామిలీ స్టార్(The Family Star Movie) మొదటి వీక్ ని అతి కష్టం మీద పూర్తి చేసుకుంది. సినిమా రిలీజ్ కి ముందు నుండే బజ్ పరంగా సినిమా కాంబో రేంజ్ తో పోల్చితే అంతగా బజ్ ను సొంతం చేసుకోలేక పోయింది. పాజిటివ్ టాక్ హెల్ప్ చాలా అవసరంతో…
బాక్స్ ఆఫీస్ బరిలోకి దిగిన సినిమా ఏ దశలో కూడా అంచనాలను అందుకోలేక పోయింది. ఈ ఇయర్ లోనే వన్ ఆఫ్ ది బెస్ట్ రిలీజ్ డేట్ లో రిలీజ్ అయిన ఫ్యామిలీ స్టార్ ఆ డేట్ అడ్వాంటేజ్ లను ఏమాత్రం వాడుకోలేక పోయింది. దాంతో మొదటి వారంలోనే తీవ్రంగా నిరాశ పరిచే రిజల్ట్ ను సొంతం చేసుకుంది సినిమా…
మొత్తం మీద 7వ రోజు సినిమా తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు 48 లక్షల రేంజ్ లో షేర్ ని రంజాన్ పండగ అడ్వాంటేజ్ తో సాధించినా కూడా అది ఏమాత్రం సరిపోదు. ఇక వరల్డ్ వైడ్ గా సినిమా 64 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకోగా టోటల్ గా మొదటి వారంలో సినిమా సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే…
The Family Star 7 Days Total World Wide Collections Report(inc GST)
👉Nizam: 4.56Cr
👉Ceeded: 87L
👉UA: 97L
👉East: 59L
👉West: 49L
👉Guntur: 62L
👉Krishna: 57L
👉Nellore: 48L
AP-TG Total:- 9.15CR (16.15CR~ Gross)
👉KA+ROI: 1.20Cr
👉OS: 4.71Cr
Total WW:- 15.02CR(28.55CR~ Gross)
మొత్తం మీద సినిమా 44 కోట్ల రేంజ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగగా ఇప్పటి వరకు సాధించిన కలెక్షన్స్ కాకుండా క్లీన్ హిట్ కోసం ఇంకా 28.98 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోవాల్సి ఉంటుంది. అది దాదాపు అసాధ్యమే అని చెప్పాలి ఇప్పుడు, ఇక రెండో వారంలో సినిమా ఎలాంటి కలెక్షన్స్ ని అందుకుంటుందో చూడాలి.