Home న్యూస్ 2.4 మిలియన్ టార్గెట్…2 రోజుల్లో వచ్చింది ఇది

2.4 మిలియన్ టార్గెట్…2 రోజుల్లో వచ్చింది ఇది

0

యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన లేటెస్ట్ మూవీ అరవింద సమేత వీర రాఘవ బాక్స్ ఆఫీస్ దగ్గర రెండు రోజుల్లో సాలిడ్ కలెక్షన్స్ ని సాధించగా సినిమా ఓవర్సీస్ మార్కెట్ లో కూడా మంచి వసూళ్లతోనే జోరు చూపుతూ దూసుకుపోతుంది. సినిమాను USA లో సుమారు 10 కోట్లకు అమ్మారు.

అంటే సినిమా అక్కడ సుమారు 2.4 మిలియన్ మార్క్ గ్రాస్ ని అందుకుంటే బ్రేక్ ఈవెన్ అవుతుంది…సినిమా ప్రీమియర్ షోల నుండి శుక్రవారం వరకు సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే…..ప్రీమియర్ షోలతో 0.79 మిలియన్ మార్క్ ని, మొదటి రోజు 0.24 మిలియన్ మార్క్ ని రెండో రోజు 0.28 మిలియన్ మార్క్ ని అందుకుంది..

టోటల్ గా ప్రీమియర్ షోలు మరియు రెండు రోజుల్లో కలిపి సినిమా అక్కడ 1.31 మిలియన్ మార్క్ ని అందుకుంది…శని మరియు ఆదివారాలలో అక్కడ సినిమా మళ్ళీ సాలిడ్ కలెక్షన్స్ ని సాధించే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి…బ్రేక్ ఈవెన్ కి ఇప్పటి నుండి మరో 1.1 మిలియన్ మార్క్ ని అందుకోవాల్సి ఉంటుంది ఈ సినిమా..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here