హర్రర్ కామెడీ జానర్ కి టైం అయిపొయింది అనుకున్నాం కానీ ఇంకా అవ్వలేదు అని ఈ ఇయర్ కాంచన 3 సినిమా నిరూపించింది. తెలుగు లో ఏకంగా 20 కోట్ల రేంజ్ లో షేర్ ని వసూల్ చేసి ఆ సినిమా సంచలనం సృష్టించింది. ఇక ఇప్పుడు ఓంకార్ డైరెక్షన్ లో వచ్చిన రాజుగారిగది సిరీస్ లోని మూడో పార్ట్ రాజుగారిగది 3 మరో సారి రుజువు చేసి బాక్స్ ఆఫీస్ దగ్గర జోరు చూపుతూ దూసుకు పోతుంది.
సినిమా మొదటి రోజు మొదటి ఆటకే మిక్సుడ్ టాక్ ని సొంతం చేసుకుంది, అయినా కానీ బాక్స్ ఆఫీస్ దగ్గర కలెక్షన్స్ మాత్రం మొదటి రోజు సాలిడ్ గా దక్కాయి. టోటల్ వరల్డ్ వైడ్ గా 1.57 కోట్ల షేర్ ని అందుకున్న సినిమా రెండో రోజు కూడా మరో సారి 1 కోటి…
రేంజ్ లో షేర్ ని రెండు తెలుగు రాష్ట్రాలలో అందుకుని సత్తా చాటుకుంది, ఒకసారి ఏరియాల వారి కలెక్షన్స్ ని గమనిస్తే
?Nizam: 42L
?Ceeded: 18L
?UA: 14L
?East: 7.4L
?West: 5.8L
?Guntur: 6.3L
?Krishna: 7.2L
?Nellore: 3.5L
AP-TG Day 2:- 1.04Cr ఇదీ సినిమా రెండో రోజు కలెక్షన్స్ లెక్క..
ఇక సినిమా టోటల్ గా 2 రోజులకు గాను వరల్డ్ వైడ్ గా సాధించిన ఏరియాల వారి కలెక్షన్స్ ని గమనిస్తే
?Nizam: 88L
?Ceeded: 46L
?UA: 30L
?East: 17L
?West: 12L
?Guntur: 20.3L
?Krishna: 16L
?Nellore: 7.5L
AP-TG 2 Days:- 2.37Cr
Ka & ROI: 0.19Cr
OS: 14L
Total: 2.70Cr(4.65Cr Gross)
సినిమాను టోటల్ గా 5.2 కోట్లకు అమ్మగా బ్రేక్ ఈవెన్ కి సినిమా 6 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోవాల్సి ఉంటుంది. రెండు రోజుల్లో సాధించిన కలెక్షన్స్ కాకుండా సినిమా మరో 3.3 కోట్ల షేర్ ని అందుకుంటే బాక్స్ ఆఫీస్ దగ్గర క్లీన్ హిట్ గా నిలుస్తుంది, ఆదివారం జోరు చూపితే టార్గెట్ మరింత తగ్గే అవకాశం ఉందని చెప్పొచ్చు. ఇక వీకెండ్ అఫీషియల్ కలెక్షన్స్ ఎలా ఉంటాయో చూడాలి…