బాక్స్ ఆఫీస్ దగ్గర యూత్ సబ్జెక్ట్ అయిన రొమాంటిక్ సినిమా తొలిరోజు టాక్ మిక్సుడ్ గా వచ్చినా కానీ కలెక్షన్స్ పరంగా మొదటి రోజు అనుకున్న అంచనాల కన్నా కూడా ఎక్కువ వసూళ్ళని సొంతం చేసుకుని బాక్స్ ఆఫీస్ దగ్గర దుమ్ము లేపింది. సినిమా రెండో రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర ఎలా హోల్డ్ చేస్తుంది అనేది ఆసక్తిగా మారగా సినిమా రెండో రోజు డ్రాప్స్ ను సొంతం చేసుకున్నా కానీ…
తిరిగి తేరుకుని మంచి కలెక్షన్స్ నే ఓవరాల్ గా సొంతం చేసుకుని కుమ్మేసింది, సినిమా కి వచ్చిన టాక్ దృశ్యా చూస్తె ఇవి సాలిడ్ కలెక్షన్స్ అనే చెప్పాలి. సినిమా రెండో రోజు 60-70 లక్షల రేంజ్ లో కలెక్షన్స్ ని అందుకునే అవకాశం ఉందని భావించగా…
సినిమా ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లో జోరు ని కొనసాగించి బాక్స్ ఆఫీస్ దగ్గర 83 లక్షల దాకా షేర్ ని రెండో రోజు సొంతం చేసుకుని బాగా హోల్డ్ చేసింది. దాంతో సినిమా టోటల్ గా 2 రోజుల్లో బాక్స్ ఆఫీస్ దగ్గర వరల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్స్ లెక్క ఈ విధంగా ఉంది…
👉Nizam: 83L
👉Ceeded: 46L
👉UA: 28L
👉East: 19L
👉West: 14L
👉Guntur: 20L
👉Krishna: 14L
👉Nellore: 11L
AP-TG Total:- 2.35CR(3.5CR~ Gross)
Ka+ROI: 6L
OS – 7L
Total WW: 2.48CR(3.75CR~ Gross)
ఇదీ సినిమా రెండు రోజుల్లో బాక్స్ ఆఫీస్ దగ్గర సాధించిన టోటల్ కలెక్షన్స్ లెక్క… సినిమా ను మొత్తం మీద 4.6 కోట్ల రేటుకి…
వరల్డ్ వైడ్ గా అమ్మగా సినిమా 5 కోట్ల ఓవరాల్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగగా 2 రోజులు పూర్తీ అయ్యే టైం కి సినిమా ఇంకా 2.52 కోట్ల షేర్ ని అందుకోవాల్సిన అవసరం ఉంది, సినిమా మూడో రోజు మంచి కలెక్షన్స్ తో హోల్డ్ చేస్తే వర్కింగ్ డేస్ లో సాధించే కలెక్షన్స్ తో ఓవరాల్ గా బాక్స్ ఆఫీస్ దగ్గర క్లీన్ హిట్ గా నిలిచే అవకాశం ఉంది.