Home న్యూస్ 2 డేస్ సామాన్యుడు కలెక్షన్స్…డే-2 బానే వచ్చాయి కానీ!!

2 డేస్ సామాన్యుడు కలెక్షన్స్…డే-2 బానే వచ్చాయి కానీ!!

0

యాక్షన్ హీరో విశాల్ నటించిన లేటెస్ట్ మూవీ సామాన్యుడు బాక్స్ ఆఫీస్ దగ్గర రీసెంట్ గా రిలీజ్ అవ్వగా సినిమా సాధించిన బిజినెస్ రేంజ్ లో ఓపెనింగ్స్ ని కలెక్షన్స్ పరంగా అయితే సొంతం చేసుకోలేక పోయింది. మొదటి రోజు అంచనాలను అందుకోలేక పోయిన ఈ సినిమా ఉన్నంతలో రెండో రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర వీకెండ్ అడ్వాంటేజ్ వలన కొంచం గ్రోత్ ని అయితే చూపించి హోల్డ్ చేసింది అని చెప్పాలి.

సినిమా మొదటి రోజు మొత్తం మీద 40 లక్షల రేంజ్ లో షేర్ ని తెలుగు రాష్ట్రాలలో సొంతం చేసుకోగా రెండో రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా 25 నుండి 30 లక్షల రేంజ్ లో కలెక్షన్స్ ని సొంతం చేసుకునే అవకాశం ఉందని భావించగా కొంచం గ్రోత్ ని చూపెట్టిన సినిమా…

మొత్తం మీద రెండో రోజు 34 లక్షల దాకా కలెక్షన్స్ ని తెలుగు రాష్ట్రాలలో సొంతం చేసుకుంది. కానీ ఈ కలెక్షన్స్ సినిమా బిజినెస్ ను అందుకోవడానికి అసలు ఏమాత్రం సరిపోవు అనే చెప్పాలి. మొత్తం మీద సినిమా 2 రోజుల తెలుగు రాష్ట్రాల కలెక్షన్స్ లెక్కలను ఒకసారి గమనిస్తే…

👉Nizam: 17L
👉Ceeded: 14L
👉UA: 11L
👉East: 9L
👉West: 5L
👉Guntur: 8L
👉Krishna: 6L
👉Nellore: 4L
AP-TG Total:- 74L(1.25CR~ Gross)
ఇదీ సినిమా 2 రోజుల్లో బాక్స్ ఆఫీస్ దగ్గర ఓవరాల్ గా సాధించిన కలెక్షన్స్ లెక్క… సినిమా ను తెలుగు రాష్ట్రాలలో మొత్తం మీద 5.1 కోట్ల రేటు కి అమ్మగా సినిమా 5.5 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో…

బరిలోకి దిగగా 2 రోజుల తర్వాత సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర బ్రేక్ ఈవెన్ అవ్వాలి అంటే ఇంకా 4.76 కోట్ల షేర్ ని సొంతం చేసుకోవాల్సి ఉంటుంది, అంటే సినిమా లాంగ్ రన్ లో అద్బుతాలు సృష్టిస్తేనే కలెక్షన్స్ పరంగా బిజినెస్ ను అందుకునే అవకాశం ఉంటుంది, ఇక మూడో రోజు సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఎలాంటి కలెక్షన్స్ ని సొంతం చేసుకుంటుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here