Home గాసిప్స్ ఇండస్ట్రీ హిట్ రీమేక్ లో ఆ 2 హీరోల్లో ఒకరు కన్ఫాం!!

ఇండస్ట్రీ హిట్ రీమేక్ లో ఆ 2 హీరోల్లో ఒకరు కన్ఫాం!!

0

  టాలీవుడ్ సంక్రాంతి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ సరికొత్త నాన్ బాహుబలి ఇండస్ట్రీ హిట్ అయిన అల వైకుంఠ పురం లో ఇక్కడ ఎలాంటి సంచలనాలు సృష్టించిందో అందరికీ తెలిసిందే, భారీ పోటి లో కూడా ఊహకందని విజయాన్ని నమోదు చేసిన ఈ సినిమా ఇప్పుడు బాలీవుడ్ లో రీమేక్ అవ్వబోతుంది. హిందీ రీమేక్ రైట్స్ టాలీవుడ్ చరిత్ర లోనే హైయెస్ట్ రేటు కి అమ్ముడు పోయి ఇప్పటికే రికార్డ్ కొట్టిన విషయం తెలిసిందే.

ఆల్ మోస్ట్ 8 కోట్ల రేంజ్ రేటు ఈ సినిమా రీమేక్ రైట్స్ ని సొంతం చేసుకుంది. కాగా హిందీ రీమేక్ లో హీరో గా ఎవరు నటిస్తారు అన్నది ఆసక్తి గా మారగా కొందరు యంగ్ హీరోలు కొందరు సీనియర్ హీరోల పేర్లు వరుస పెట్టి వినిపిస్తున్నా ఫైనల్ గా 2 రేసులో ఉన్నారని తెలుస్తుంది.

ప్రస్తుతం ఉన్న ఫామ్ దృశ్యా అయితే అక్షయ్ కుమార్ కానీ లేదా షాహిద్ కపూర్ కానీ ఈ రీమేక్ లో ఫైనల్ ఆయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. ఇద్దరూ ప్రస్తుతం సూపర్ ఫామ్ లో ఉన్నారు. ఎవరు ఓకే చెప్పినా మరో 200 కోట్ల కలెక్షన్స్ ని కొల్లగొట్టే సినిమా వారి ఖాతాలో పడటం ఖాయమని చెప్పొచ్చు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here