Home టోటల్ కలెక్షన్స్ 200 థియేటర్స్…..70L బిజినెస్…..టోటల్ గా వచ్చింది ఇది!!

200 థియేటర్స్…..70L బిజినెస్…..టోటల్ గా వచ్చింది ఇది!!

2693
0

కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ గారు మరణించిన రోజునే ఆడియన్స్ ముందుకు పునీత్ అన్నయ్య శివరాజ్ కుమార్ హీరోగా రూపొందిన మోస్ట్ అవైటెడ్ మూవీ భజరంగి 2 రిలీజ్ ను సొంతం చేసుకోగా, పునీత్ మరణం కన్నడ ఇండస్ట్రీపై గట్టి ఇంపాక్ట్ ని క్రియేట్ చేయగా ఆ ఇంపాక్ట్ వలన బాక్స్ ఆఫీస్ దగ్గర కన్నడలో భజరంగి 2 కి కలెక్షన్స్ పరంగా దెబ్బ తగిలింది… సినిమా కి అక్కడ మంచి టాక్ లభించగా…

తెలుగు లో సజావుగా రిలీజ్ ను సొంతం చేసుకున్న ఈ సినిమా కి ఇక్కడ 200 వరకు థియేటర్స్ సొంతం అవ్వగా ఓవరాల్ గా 70 లక్షల దాకా బిజినెస్ జరిగింది. హీరో గురించి మన వాళ్ళకి చాలా తక్కువగానే తెలుసు కాబట్టి టాక్ బాగుంటే చూద్దాం అనుకున్నారు కానీ…

సినిమాలో విజువల్స్ అండ్ గ్రాఫిక్స్ కి పేరు వచ్చినా కంటెంట్ యావరేజ్ ఉండటంతో పాజిటివ్ రివ్యూలు రాలేదు, దాంతో ఎలాగోలా 4 రోజుల్లో బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ సినిమా 21 లక్షల షేర్ ని 36 లక్షల దాకా గ్రాస్ ను సొంతం చేసుకుంది ఈ సినిమా. ఇక టోటల్ రన్ కంప్లీట్ అయ్యే టైం కి…

ఈ సినిమా తెలుగు లో 35 లక్షల దాకా షేర్ ని 60 లక్షల దాకా గ్రాస్ ను సొంతం చేసుకున్నట్లు సమాచారం. ఈ కలక్షన్స్ లో కూడా నెగటివ్ షేర్స్ అండ్ డెఫిసిట్ లు తీయకుండా వచ్చిన కలెక్షన్స్… ఓవరాల్ గా 70 లక్షల దాకా బిజినెస్ ను సొంతం చేసుకున్నన ఈ సినిమా అందులో సగం మాత్రమే మొత్తం మీద రికవరీ చేయగలిగింది.

ఇక కర్ణాటకలో సినిమా ఫస్ట్ వారం మొత్తం మీద చాలా తక్కువ షోలే పడగా 3.5 కోట్ల దాకా కలెక్షన్స్ ని సొంతం చేసుకోగా రెండో వారం నుండి పరుగు కంప్లీట్ అయ్యే టైం కి 13 కోట్ల లోపు గ్రాస్ ను ఓవరాల్ గా సొంతం చేసుకుందని అంటున్నారు. అక్కడ ఉన్న పరిస్థితుల నేపధ్యంలో సినిమా అన్నీంటినీ తట్టుకుని పర్వాలేదు అనిపించింది అనే చెప్పాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here