2024 ఇయర్ టాలీవుడ్ లో మొదట్లో అనుకున్న రేంజ్ లో కలిసి రాలేదు….ఫస్టాఫ్ లో కొన్ని సినిమాలు మాత్రమే హిట్ అవ్వగా ఎలక్షన్స్ ఫీవర్ వలన చాలా సినిమాలు పోస్ట్ పోన్ అవ్వాల్సి రాగా ఓవరాల్ గా ఇయర్ లో రిలీజ్ అయిన పెద్ద నోటబుల్ సినిమాలు తక్కువే అయినా కూడా ఓవరాల్ గా పెద్ద సినిమాలు ఆల్ మోస్ట్ అన్నీ కూడా…
ఎక్స్ లెంట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుని మాస్ ఊచకోత కోశాయి….కాగా ఇప్పుడు ఆల్ మోస్ట్ ఇయర్ ఎండ్ అయ్యింది కాబట్టి ఒక్కోటిగా ఈ ఇయర్ బిగ్గెస్ట్ కలెక్షన్స్ ని అందుకున్న సినిమాల్లో ముందుగా మొదటి రోజుకి గాను తెలుగు రాష్ట్రాల్లో హైయెస్ట్ కలెక్షన్స్ ని అందుకున్న సినిమాల్లో…
ఇయర్ మొదట్లో వచ్చిన గుంటూరు కారం సినిమా సాలిడ్ ఓపెనింగ్స్ ను అందుకోగా ఆల్ మోస్ట్ 6 నెలలు టాప్ లో నిలిచింది. తర్వాత కల్కి మూవీ వచ్చి గుంటూరు కారం సాలిడ్ ఓపెనింగ్స్ ను బ్రేక్ చేసింది…ఆ సినిమా రికార్డ్ మూడు నెలల గ్యాప్ లో వచ్చిన…
దేవర మూవీ సాలిడ్ లీడ్ తో బ్రేక్ చేసింది….దేవర ఓపెనింగ్ డే కలెక్షన్స్ ని మూడు నెలల లోపు గ్యాప్ లో వచ్చిన పుష్ప2 మూవీ బ్రేక్ చేసి దుమ్ము దులిపేసి ఇయర్ టాపర్ గా నిలిచింది…ఒకసారి ఈ ఇయర్ టాలీవుడ్ తరుపున రిలీజ్ అయిన మూవీస్ లో మొదటి రోజు హైయెస్ట్ కలెక్షన్స్ ని అందుకున్న సినిమాలను గమనిస్తే…
2024 Tollywood Movies top 1st Day Collections in AP-TG
👉#Pushpa2TheRule – 70.81CR(Inc 6.35CR~ premieres)
👉#Devara – 61.65CR
👉#Kalki2898AD – 44.86CR
👉#GunturKaaram – 38.88CR
👉#TilluSquare – 9.25CR
👉#HanuMan – 7.97CR(Inc Premieres)
👉#Bharateeyudu2(Dub) – 6.75CR
👉#DoubleiSmart – 6.10CR
👉#SaripodhaaSanivaaram – 5.88CR
👉#MrBachchan – 4.56CR(Inc Premieres)
👉#NaaSaamiRanga – 4.30CR
మొత్తం మీద ప్రీవియస్ ఇయర్స్ తో పోల్చితే 10 కోట్లకు పైగా ఓపెనింగ్స్ ను అందుకున్న సినిమాలు ఈ ఇయర్ లో తగ్గాయి…కానీ పెద్ద సినిమాలు సాలిడ్ లాంగ్ రన్ ను సొంతం చేసుకుని దుమ్ము లేపడం మాత్రం కలిసి రావడంతో ఇయర్ ఎండ్ అయ్యే టైంకి టాలీవుడ్ తరుపున సాలిడ్ రికార్డులు నమోదు అయ్యాయి… ఇక 2025 లో ఎన్ని సినిమాలు దుమ్ము లేపుతాయో చూడాలి.