నాచురల్ స్టార్ నాని నుండి ఆడియన్స్ ముందుకు థియేటర్స్ లో గ్రాండ్ గా రిలీజ్ ను సొంతం చేసుకోవాల్సిన మూవీ టక్ జగదీష్ బాక్స్ ఆఫీస్ దగ్గర రిలీజ్ ను కాన్సిల్ చేసుకుని ఆడియన్స్ ముందుకు డైరెక్ట్ రిలీజ్ ను అమెజాన్ ప్రైమ్ లో వినాయక చవితి కానుకగా సొంతం చేసుకున్న విషయం తెలిసిందే, సినిమా కి ఫ్యామిలీ మూవీస్ ఇష్టపడే వాళ్ళ నుండి మంచి టాక్ లభించినా రెగ్యులర్ మూవీస్…
ఇష్టపడే వాళ్ళ నుండి మిశ్రమ స్పందన లభించినా కానీ వ్యూవర్ షిప్ మాత్రం సాలిడ్ గా కొనసాగిందని సమాచారం. అమెజాన్ ప్రైమ్ లో డైరెక్ట్ రిలీజ్ ను సొంతం చేసుకున్న తెలుగు సినిమాల పరంగా ఓపెనింగ్ రోజున మొదటి వీక్ లో హైయెస్ట్ వ్యూవర్ షిప్ ను…
ఈ సినిమా సొంతం చేసుకుందని తెలియజేయగా ఇప్పుడు మూడు వారాలు కంప్లీట్ అయ్యే టైం కి సినిమా అమెజాన్ ప్రైమ్ లో సాధించిన ఓవరాల్ వ్యూవర్ షిప్ లెక్కలు ట్రేడ్ లో చక్కర్లు కొడుతున్నాయి. ఆ లెక్కల ప్రకారం సినిమా కి సెన్సేషనల్ వ్యూవర్ షిప్ లభించింది అని అంటున్నారు ఇప్పుడు.
ఓవరాల్ గా అన్నీ కలిపి ఈ సినిమా కి ప్రైమ్ వీడియోలో 22 మిలియన్స్ కి పైగా వ్యూస్ లభించాయని అంటున్నారు. అందులో యూనిక్ వ్యూస్ ఎంత అనేది చెప్పలేదు కానీ యావరేజ్ గా 6-8 మిలియన్స్ వరకు యూనిక్ వ్యూస్ ని సొంతం చేసుకునే అవకాశం ఉందని చెప్పొచ్చు. సినిమా మొదటి వారం 10 రోజుల పాటు సాలిడ్ గా వ్యూస్ ని సొంతం చేసుకున్న తర్వాత కొంచం స్లో అయినా…
ప్రైమ్ వీడియోలో మూడు వారాల పాటు టాప్ 5 మూవీస్ లో ఒకటిగా ట్రెండ్ అవుతూనే వచ్చింది. ప్రస్తుతం టాప్ 6 ప్లేస్ లో ట్రెండ్ అవుతున్న ఈ సినిమా మొత్తం మీద ప్రైమ్ వీడియో వాళ్ళు పెట్టిన 37 కోట్ల రేటు కి పూర్తీ న్యాయం చేసే విధంగా వ్యూస్ ని సొంతం చేసుకుందని చెప్పొచ్చు. ఇంకా లాంగ్ రన్ లో వ్యూస్ ఇలానే స్టేబుల్ గా ఉండే అవకాశం ఉందని చెప్పాలి.