బాక్స్ ఆఫీస్ దగ్గర దీపావళి వీకెండ్ లో బరిలోకి దిగిన 4 కొత్త సినిమాలు కూడా వేటి రేంజ్ లో అవి ఉన్నంతలో పర్వాలేదు అనిపించే రేంజ్ లో టాక్ ని ఆడియన్స్ నుండి సొంతం చేసుకోగా ఆడియన్స్ కి ఆప్షన్స్ మరీ ఎక్కువ ఉండటంతో ఏ సినిమాకి కూడా మరీ అద్బుతమైన ఓపెనింగ్స్ ఏమి లభించలేదు. ఇక రెండో రోజుకి వచ్చే సరికి ఒక సినిమా మాత్రం మినిమమ్ ఇంపాక్ట్ కూడా చూపించకుండా…
బాక్స్ ఆఫీస్ దగ్గర తీవ్రంగానే నిరాశ పరిచింది, ఆ సినిమా మంచు విష్ణు నటించిన జిన్నా… మొత్తం మీద రెండో రోజు సినిమా అటూ ఇటూగా 10 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం కనిపిస్తూ ఉండగా మిగిలిన సినిమాల్లో…
ఓరి దేవుడా సినిమా రెండో రోజు డీసెంట్ హోల్డ్ ని చూపించగా ఈ రోజు సినిమా తెలుగు రాష్ట్రాల్లో అటూ ఇటూగా 60 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం కనిపిస్తూ ఉండగా ఫైనల్ ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ బాగుంటే లెక్క కొంచం పెరగవచ్చు.
ఇక ప్రిన్స్ మూవీ రెండో రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర తెలుగు రాష్ట్రాల్లో 50 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం కనిపిస్తూ ఉండగా సర్దార్ సినిమా అన్ని సినిమాల లోకి బెటర్ గా ట్రెండ్ అవుతూ ఉండగా ఈ రోజు సినిమా 80 లక్షల నుండి 90 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం ఉందని చెప్పాలి. ఫైనల్ ఆఫ్ లైన్ లెక్కలు బాగుంటే ఇంకా కలెక్షన్స్ పెరిగే ఛాన్స్ ఉంది.
మొత్తం మీద ఈ సినిమాలకు ఏమాత్రం తీసిపోని విధంగా ఈ రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర కాంతార సినిమా మరోసారి రాంపేజ్ ను చూపిస్తూ ఆడియన్స్ కి ఫస్ట్ ఛాయిస్ గా నిలిచింది. మొత్తం మీద ఇక అన్ని సినిమాల బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ రిపోర్ట్ ఇదే రేంజ్ లో ఉంటుందో లేదో చూడాలి.