Home గాసిప్స్ మంచు విష్ణుకి ఊరట….జాక్ పాట్ కొట్టే డీల్ కొట్టిన జిన్నా మూవీ!!

మంచు విష్ణుకి ఊరట….జాక్ పాట్ కొట్టే డీల్ కొట్టిన జిన్నా మూవీ!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర మంచు విష్ణు నటించిన లేటెస్ట్ మూవీ జిన్నా భారీ పోటి లో రిలీజ్ అయ్యి ఆడియన్స్ ను థియేటర్స్ కి రప్పించే విషయంలో తీవ్రంగా నిరాశ పరిచిన విషయం అందరికీ తెలిసిందే. దాంతో ఏ దశలో కూడా ఆకట్టుకోలేక పోయిన ఈ సినిమా బడ్జెట్ పరంగా చూసుకుంటే బిగ్ డిసాస్టర్ గా నిలిచింది బాక్స్ ఆఫీస్ దగ్గర… డిజిటల్ రైట్స్ అయినా డీసెంట్ రేటు సొంతం చేసుకుంటాయి అనుకుంటే….

సినిమాను కొనడానికి ఏ OTT ముందుకు రాక పోవడంతో అమెజాన్ ప్రైమ్ లో పెర్సెంటేజ్ వైజ్ గా సినిమా స్ట్రీమ్ అవుతూ ఉండగా అక్కడ నుండి కూడా పెద్దగా రెవెన్యూ వచ్చే అవకాశం కనిపించడం లేదు, కానీ ఇలాంటి టైం లో సినిమా కి…

జాక్ పాట్ అనిపించే డీల్ సొంతం అయ్యింది అంటూ టాలీవుడ్ ట్రేడ్ లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఆ వార్తల ప్రకారం సినిమా హిందీ డబ్బింగ్ రైట్స్ కింద మంచి రేటు సొంతం అయ్యింది అని అంటున్నారు. యూట్యూబ్ లో హిందీ డబ్బింగ్ వర్షన్ అలాగే…

హిందీ శాటిలైట్ రైట్స్ అన్నీ కలిపి హిందీ రైట్స్ కింద 4 కోట్ల దాకా డీల్ ఈ సినిమా కి సొంతం అయ్యింది అని అంటున్నారు. దాంతో ఈ న్యూస్ కనుక నిజం అయితే ఆల్ మోస్ట్ భారీ లాస్ కన్ఫామ్ అనుకున్న టైం లో ఇది మంచి జాక్ పాట్ అనే చెప్పాలి. ఇక హిందీ లో సినిమా రెస్పాన్స్ ఎలా ఉంటుందో చూడాలి. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here