నట సింహం నందమూరి బాలకృష్ణ(Nandamuri Balakrishna) నటించిన ఈ ఇయర్ సంక్రాంతి హిట్ మూవీ వీర సింహా రెడ్డి(Veera Simha Reddy) సినిమా బాలయ్య కి అఖండ తర్వాత మరో అద్బుతమైన హిట్ మూవీ గా నిలిచిన విషయం అందరికీ తెలిసిందే…
బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ ఓపెనింగ్స్ ను అందుకున్న ఈ సినిమా టాక్ కొంచం మిక్సుడ్ గా ఉన్నా కూడా సంక్రాంతికి పోటిని కూడా తట్టుకుని బాలయ్య కెరీర్ లో ఆల్ టైం హైయెస్ట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుని 134 కోట్ల రేంజ్ లో గ్రాస్ వసూళ్ళని సొంతం చేసుకుంది.
అలాంటి కలెక్షన్స్ ని సొంతం చేసుకున్న ఈ సినిమా ఒక థియేటర్ లో పరుగును ఇంకా కొనసాగిస్తూ రీసెంట్ 200 రోజుల డైరెక్ట్ రన్ ని కూడా కంప్లీట్ చేసుకుని సంచలనం సృష్టించగా ఇప్పుడు లేటెస్ట్ గా 225 రోజులను అక్కడ పూర్తి చేసుకుని సంచలనం సృష్టించడం విశేషం..
రిలీజ్ అయిన రోజు నుండి ఒక్క షో కూడా గ్యాప్ లేకుండా ఆలూరు లక్ష్మీ నరసింహ థియేటర్ లో డైరెక్ట్ గా 200 రోజులను వీర సింహా రెడ్డి సినిమా కంప్లీట్ చేసుకుని ఇప్పుడు సంచలనం సృష్టించింది వీర సింహా రెడ్డి సినిమా…
రెండు బాక్ టు బాక్ భారీ వసూళ్ళని అందుకున్న మూవీస్ తర్వాత నట సింహం బాలయ్య ఇప్పుడు భగవంత్ కేసరి(Bhagavanth Kesari) సినిమా తో దసరా బరిలో నిలుస్తూ ఉండగా ఆ సినిమాతో ఏ రేంజ్ లో రచ్చ చేస్తాడో చూడాలి ఇప్పుడు.