Home న్యూస్ 20 కోట్ల ఊచకోత….తుక్కు తుక్కుగా కొట్టాడుగా!!

20 కోట్ల ఊచకోత….తుక్కు తుక్కుగా కొట్టాడుగా!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర సమ్మర్ కానుకగా రిలీజ్ అయిన యంగ్ హీరో  సిద్హూ జొన్నలగడ్డ(Siddhu Jonnalagadda) నటించిన లేటెస్ట్ మూవీ టిల్లు స్క్వేర్(Tillu Square 1st Day Collections) సినిమా ఊరమాస్ ఓపెనింగ్స్ తో తెలుగు రాష్ట్రాలలో అలాగే వరల్డ్ వైడ్ గా కూడా ఊహకందని ఊచకోత కోసింది…

అంచనాలను మించి పోయే రేంజ్ లో కలెక్షన్స్ ని సొంతం చేసుకుంది మొదటి రోజున, నైజాం నుండే రాంపెజ్ మొదలు అయ్యి అమెరికా వరకు కూడా అన్ని చోట్లా రిమార్కబుల్ డే 1 నంబర్స్ ను సినిమా నమోదు చేయబోతూ ఉండగా మొదటి రోజు ట్రాక్ చేసిన సెంటర్స్ ను బట్టి చూస్తూ ఉంటే నైజాం నుండే…

5-6 కోట్ల రేంజ్ కి తగ్గని గ్రాస్ వసూళ్లు సినిమా సొంతం చేసుకునే అవకాశం ఉండగా తెలుగు రాష్ట్రాల్లో మొత్తం మీద 11-12 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ ని అందుకునే అవకాశం కనిపిస్తుంది…. రెస్ట్ ఆఫ్ ఇండియా మొత్తం మీద 1-1.2 కోట్ల రేంజ్ లో గ్రాస్ వచ్చే అవకాశం ఉండగా ఓవర్సీస్ లో సినిమా ప్రీమియర్స్ అండ్ డే 1 కలెక్షన్స్ తో…

కలిపి ఇప్పుడు ఓవరాల్ గా 6-7 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను సొంతం చేసుకునే అవకాశం కనిపిస్తూ ఉంది. దాంతో ఓవరాల్ గా మొదటి రోజు వరల్డ్ వైడ్ గా 20 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ మార్క్ ని సినిమా అందుకునే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి. ఫైనల్ ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు అంచనాలను మించి పొతే….

20 నుండి 22 కోట్ల రేంజ్ దాకా గ్రాస్ కలెక్షన్స్ తో టిల్లు స్క్వేర్ మూవీ తుక్కు తుక్కుగా బాక్స్ ఆఫీస్ ను షేక్ చేసి అన్ సీజన్ కి ఎండ్ కార్డ్ వేయబోతుంది అని చెప్పాలి. ఇక ఫస్ట్ డే అఫీషియల్ ఏరియాల వారి కలెక్షన్స్ లెక్క ఇదే రేంజ్ లో ఉంటుందో లేక కొంచం అటూ ఇటూగా ఉంటాయో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here