Home న్యూస్ USA లో టైర్2 మూవీస్ టాప్ ప్రీమియర్స్ రికార్డులు….టిల్లు స్క్వేర్ మెంటల్ మాస్ రికార్డ్!

USA లో టైర్2 మూవీస్ టాప్ ప్రీమియర్స్ రికార్డులు….టిల్లు స్క్వేర్ మెంటల్ మాస్ రికార్డ్!

0

రెండేళ్ళ క్రితం వచ్చిన డిజే టిల్లు(DJ Tillu Movie) సినిమాతో బాక్స్ ఆఫీస్ దగ్గర సెన్సేషనల్ లాభాలను సొంతం చేసుకుని దుమ్ము దుమారం లేపిన సిద్హూ జొన్నలగడ్డ(Siddhu Jonnalagadda) నటించిన లేటెస్ట్ మూవీ టిల్లు స్క్వేర్(Tillu Square Movie) బాక్స్ ఆఫీస్ దగ్గర రీసెంట్ గా రిలీజ్ అయ్యి అంచనాలను మించి పోయే రేంజ్ లో…

బాక్స్ ఆఫీస్ దగ్గర సాలిడ్ కలెక్షన్స్ తో మాస్ రచ్చ చేస్తుంది….తెలుగు రాష్ట్రాల్లో సినిమా పార్ట్ 1 క్రేజ్ దృశ్యా దుమ్ము దుమారం లేపే ఓపెనింగ్స్ ను అందుకున్న ఈ సినిమా ఓవర్సీస్ లో అంచనాలను అన్నీ కూడా మించి పోయే సెన్సేషనల్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుంది…..

చివరి నిమిషంలో కొన్ని చోట్ల ప్రింట్స్ డిలే వలన షోలు కాన్సిల్ అయినా కూడా ఆల్ మోస్ట్ హాల్ఫ్ మిలియన్ మార్క్ రేంజ్ దాకా గ్రాస్ ఓపెనింగ్స్ ను అమెరికాలో సొంతం చేసుకున్న ఈ సినిమా టాలీవుడ్ మీడియం రేంజ్ హీరోల సినిమాల పరంగా సెన్సేషనల్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుంది…

అక్కడ దసరా మూవీ 6 లక్షలకు పైగా డాలర్స్ తో మీడియం రేంజ్ హీరోల సినిమాలలో రికార్డ్ కొత్తగా లైగర్ మూవీ హాల్ఫ్ మిలియన్ మార్క్ ని దాటింది. ఇక ఇప్పుడు టిల్లు స్క్వేర్ మూవీ కూడా ఆల్ మోస్ట్ హాల్ఫ్ మిలియన్ మార్క్ ని దాటేసి టాప్ 3 లో ఒకటిగా నిలిచింది, మిగిలిన హీరోలు ఎవ్వరూ కూడా దరిదాపుల్లో లేక పోవడం…

డిజే టిల్లు బ్రాండ్ వాల్యూ ఏ రేంజ్ లో పెరిగింది అన్న దానికి నిదర్శనం…సినిమా ఓపెనింగ్స్ పరంగానే కాదు ఇప్పుడు సూపర్ పాజిటివ్ రెస్పాన్స్ ను సొంతం చేసుకోవడంతో లాంగ్ రన్ ను కూడా సాలిడ్ గా ఎంజాయ్ చేసే అవకాశం ఎంతైనా ఉంది, మరి లాంగ్ రన్ లో సినిమా అక్కడ ఏ రేంజ్ లో వసూళ్ళ ప్రభంజనం సృష్టిస్తుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here