వారాలు గడుస్తున్న కొద్ది కొత్త సినిమాలు వస్తున్నా కానీ ఉప్పెన సినిమా బాక్స్ ఆఫీస్ జోరు మాత్రం ఆగడం లేదు, మూడు వారాల్లో దిగ్విజయంగా 50 కోట్ల షేర్ మార్క్ ని అందుకున్న ఉప్పెన సినిమా 4 వ వారం బాక్స్ ఆఫీస్ దగ్గర కొత్త సినిమాలు కుప్పలు తెప్పలుగా రిలీజ్ అయినా కానీ మళ్ళీ బాగా హోల్డ్ చేసి ఏ1 ఎక్స్ ప్రెస్ తర్వాత బెస్ట్ ట్రెండ్ అయిన సినిమాగా నిలిచి దుమ్ము లేపింది.
ఈ క్రమం లో సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మరో మైలురాయి ని కూడా అధిగమించి దుమ్ము లేపింది, సినిమా బిజినెస్ మీద ఓవరాల్ ప్రాఫిట్ 24 రోజుల్లో ఏకంగా 30 కోట్ల మార్క్ ని అధిగమించి సంచలనం సృష్టించింది, టాలీవుడ్ లో మీడియం రేంజ్ మూవీస్ లో…
ఇలా 30 కోట్ల రేంజ్ ప్రాఫిట్ ను సొంతం చేసుకున్న అతికొద్ది సినిమాల్లో ఒకటిగా చేరింది ఉప్పెన సినిమా….మొత్తం మీద 24 వ రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర 24 లక్షల షేర్ ని సొంతం చేసుకుని దుమ్ము లేపిన ఈ సినిమా టోటల్ వరల్డ్ వైడ్ గా 24 రోజుల్లో సాధించిన టోటల్ కలెక్షన్స్ ని గమనిస్తే…
👉Nizam: 15.38Cr
👉Ceeded: 7.67Cr
👉UA: 8.46Cr
👉East: 5.01Cr
👉West: 2.60Cr
👉Guntur: 2.94Cr
👉Krishna: 3.12Cr
👉Nellore: 1.73Cr
AP-TG Total:- 46.91CR(76.90Cr Gross~)
Ka+ROI – 2.35Cr Approx(Updated)
Os – 1.38Cr Approx.
Total – 50.64Cr(82.50Cr~ Gross)(Updated)
ఇదీ సినిమా వరల్డ్ వైడ్ గా 24 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ భీభత్సం. సినిమాను టోటల్ గా 20.5 కోట్లకు అమ్మగా సినిమా టోటల్ గా ఇప్పటి వరకు…
బిజినెస్ మీద 30.14 కోట్ల ప్రాఫిట్ ను సొంతం చేసుకోగా బ్రేక్ ఈవెన్ టార్గెట్ 21 కోట్లకి సినిమా 29.64 కోట్ల ప్రాఫిట్ ను సొంతం చేసుకుంది, ట్రిపుల్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన ఈ సినిమా ఈ వారం ముగిసే లోపు 51 కోట్ల షేర్ మార్క్ ని అందుకునే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి. అంతకుమించి ముందుకు ఎంతవరకు వెళుతుందో చూడాలి…