Home న్యూస్ మొదలైన RC16….అందరూ ఈయన్ని ఓ రేంజ్ లో లేపుతున్నారుగా!

మొదలైన RC16….అందరూ ఈయన్ని ఓ రేంజ్ లో లేపుతున్నారుగా!

0

RRR మూవీతో పాన్ ఇండియా రేంజ్ లో క్రేజ్ ను సొంతం చేసుకున్న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్(Ram Charan) ఆ సినిమా తర్వాత ఇండియన్ టాప్ డైరెక్టర్స్ లో ఒకరైన శంకర్(Director Shankar) తో గేమ్ చేంజర్(Game Changer Movie) తో ప్రస్తుతం రచ్చ చేయడానికి సిద్ధం అవుతూ ఉండగా ఈ సినిమా…

బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ ఇయర్ లోనే రిలీజ్ అయ్యే అవకాశం ఎంతైనా ఉండగా ఈ సినిమా తర్వాత రామ్ చరణ్ చేయబోయే సినిమా ఉప్పెన(Uppena Movie) డైరెక్టర్ అయిన బుచ్చిబాబు సనా(Buchibabu sana) డైరెక్షన్ లో ఉండబోతుండగా సినిమా ను రీసెంట్ గా అఫీషియల్ గా లాంచ్ చేశారు…

కాగా సినిమాలో రామ్ చరణ్ కి జోడిగా జాన్వి కపూర్(Janhvi Kapoor) నటిస్తూ ఉండగా కీలక రోల్ లో కన్నడ స్టార్ శివరాజ్ కుమార్(Shiva Raj Kumar) నటించబోతుండగా సినిమాకి మ్యూజిక్ ఆస్కార్ అవార్డ్ విన్నర్ ఏ ఆర్ రెహ్మాన్ అందించబోతున్నాడు… భారీ స్టార్ కాస్ట్ తో భారీ బడ్జెట్ తో రూపొందబోతున్న ఈ సినిమా గురించి…

అందరూ భారీ ఆశలు పెట్టుకోగా పూజా కార్యక్రమంలో అందరూ కూడా డైరెక్టర్ బుచ్చిబాబు సనాని ఓ రేంజ్ లో హైలెట్ చేశారని చెప్పాలి…. రెహ్మన్ మాట్లాడుతూ ఈ డైరెక్టర్ చాలా క్రేజీ అంటూ చెప్పగా జాన్వి కపూర్ స్టొరీ చెప్పేటప్పుడు డైరెక్టర్ కళ్ళలో ఫైర్ కనిపించింది అని చెప్పింది. ఇక స్పెషల్ రోల్ చేస్తున్న శివరాజ్ కుమార్ మాట్లాడుతూ…

డైరెక్టర్ నాతో కథ చెబుతానని 30 నిమిషాల టైం చెప్పి 90 నిముషాలు కథని చెప్పాడని..తను చెప్పిన విధానానికి నేను ఫ్లాట్ అయ్యాయని అన్నాడు…. ఇక రామ్ చరణ్ మాట్లాడుతూ బుచ్చికి సినిమాలు అంటే పిచ్చి అంటూ చెప్పుకొచ్చాడు… ఇలా అందరూ కూడా డైరెక్టర్ ను ఓ రేంజ్ లో పొగిడారు….

ఇంతలా డైరెక్టర్ ను పొగుడుతున్నారు అంటే బుచ్చిబాబు ఏ రేంజ్ లో కథని ఇచ్చాడో అని అందరూ అనుకుంటున్నారు. పాన్ ఇండియా రేంజ్ లో రూపొందబోతున్న ఈ సినిమా మీద అంచనాలు సాలిడ్ గా ఉన్నాయి. మరి సినిమా ఎంతవరకు అంచనాలను అందుకుని బాక్స్ ఆఫీస్ దగ్గర దుమ్ము దుమారం లేపుతుందో చూడాలి…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here