గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(Ram Charan) ఇప్పుడు భారీ కంబ్యాక్ కి సిద్ధం అవుతున్న సెన్సేషనల్ మూవీ అయిన పెద్ది(Peddi Movie) వచ్చే ఇయర్ సమ్మర్ కానుకగా గ్రాండ్ గా రిలీజ్ కి సిద్ధం కానుండగా..ఈ ఇయర్ రామ్ చరణ్ పుట్టిన రోజు టైంలో సినిమా ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేయగా…రీసెంట్ గా సినిమా అఫీషియల్ గ్లిమ్స్ ను…
ఆడియన్స్ ముందుకు తీసుకు వచ్చారు….కాగా గ్లిమ్స్ లో రామ్ చరణ్ లుక్స్, రెహమాన్ బ్యాగ్రౌండ్ స్కోర్ ఓ రేంజ్ లో హైలెట్ అవ్వగా గ్లిమ్స్ ఎండింగ్ షాట్స్ సోషల్ మీడియాలో సాలిడ్ గా వైరల్ అవుతూ ఉండటం విశేషం అని చెప్పాలి. మొత్తం మీద గ్లిమ్స్ సినిమా మీద ఉన్న…
అంచనాలను అమాంతం పెంచేసింది అని చెప్పాలి ఇప్పుడు… ఓవరాల్ గా ఇప్పుడు 24 గంటలు పూర్తి అయ్యే టైంకి ఓవరాల్ గా అనుకున్న అంచనాలను మించి పోయి టాలీవుడ్ లో ఆల్ టైం రికార్డ్ వ్యూస్ ని గ్లిమ్స్ లలో సొంతం చేసుకోగా ఇండియన్ మూవీస్ పరంగా కూడా…
ఆల్ టైం టాప్2 ప్లేస్ ను సొంతం చేసుకుంది. లైక్స్ పరంగా మాత్రం పెద్దగా కొత్త రికార్డులు ఏమి క్రియేట్ చేయలేక పోయిన ఈ గ్లిమ్స్ ఓవరాల్ గా టాలీవుడ్ లో టాప్ 8 హైయెస్ట్ లైక్స్ ను అందుకున్న గ్లిమ్స్ గా అయితే నిలిచింది అని చెప్పాలి ఇప్పుడు…
మొత్తం మీద 24 గంటలు పూర్తి అయ్యే టైంకి పెద్ది గ్లిమ్స్ కి వ్యూస్ పరంగా 31.15 మిలియన్ వ్యూస్ మార్క్ ని క్రాస్ చేసి సంచలనం సృష్టించింది…ప్రీవియస్ రికార్డ్ కన్నా ఆల్ మోస్ట్ 5 మిలియన్ లీడ్ తో కొత్త బెంచ్ మార్క్ ని టాలీవుడ్ లో నమోదు చేసింది.
ఇక లైక్స్ పరంగా 24 గంటలు పూర్తి అయ్యే టైంకి ఈ గ్లిమ్స్ కి 462K లైక్స్ సొంతం అయ్యాయి… ఓవరాల్ గా లైక్స్ పరంగా ఆల్ టైం టాప్ 8 ప్లేస్ ను సొంతం చేసుకుని పర్వాలేదు అనిపించగా మొత్తం మీద సినిమా మీద ఇప్పుడు సాలిడ్ బజ్ ఏర్పడగా ఎప్పుడు రిలీజ్ అయినా మాస్ రచ్చ చేయడం ఖాయమని చెప్పాలి ఇప్పుడు.