బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటివారంలో సాలిడ్ కలెక్షన్స్ ను సొంతం చేసుకుని రెండో వారంలో అడుగు పెట్టిన సంక్రాంతి మూవీస్ లో సైంధవ్(Saindhav Movie) ఆల్ మోస్ట్ పూర్తిగా స్లో డౌన్ అవ్వగా మిగిలిన సినిమాలలో మొదటి వారాన్ని కంప్లీట్ చేసుకుని రెండో వారంలో అడుగు పెట్టిన నాగార్జున(Nagarjuna) నటించిన…
నా సామి రంగ(Naa Saami Ranga) సినిమా 8వ రోజు కొన్ని చోట్ల డే 7కి సిమిలర్ గా ట్రెండ్ అవుతూ ఉండగా మొత్తం మీద సినిమా ఈ రోజు అటూ ఇటూగా 80-90 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం ఉండగా ఫైనల్ ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు బాగుంటే 1 కోటి రేంజ్ దాకా షేర్ ని అందుకునే అవకాశం ఉంది.
ఇక 10వ రోజులో అడుగు పెట్టిన సూపర్ స్టార్ మహేష్ బాబు(Mahesh Babu) నటించిన గుంటూరు కారం(Gunturu Kaaram) మూవీ 10వ రోజు మరోసారి పర్వాలేదు అనిపించేలా జోరు చూపిస్తూ ఉండగా ఆంధ్రలో ఎక్స్ లెంట్ గా హోల్డ్ ని కొనసాగిస్తున్న సినిమా నైజాంలో మాత్రం డ్రాప్స్ ను సొంతం చేసుకుంటూ ఉండగా…
మొత్తం మీద సినిమా ఈ రోజు 1.6-1.8కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం ఉంది. వరల్డ్ వైడ్ గా 2 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం ఉంది. ఇక సెకెండ్ వీక్ లో రికార్డ్ లెవల్ లో జోరు చూపిస్తూ దూసుకు పోతున్న హనుమాన్(HanuMan Movie) 10వ రోజు మరోసారి అన్ని చోట్లా సాలిడ్ గా ట్రెండ్ అవుతూ ఉండగా…
తెలుగు రాష్ట్రాల్లో మరోసారి 6-6.5కోట్లకు పైగా షేర్ ని అందుకోవడం ఖాయంగా ఉండగా వరల్డ్ వైడ్ గా 11 కోట్లకు పైగా షేర్ ని అందుకునే ఆవకాశం ఉంది. హిందీలో ఓవర్ ఫ్లో ని సొంతం చేసుకుంటే లెక్క ఇంకా పెరిగే అవకాశం ఉంది. ఇక అన్ని సినిమాలు ఈ రోజు ఇదే రేంజ్ లో వసూళ్ళని అందుకుంటాయా లేక ఇంతకు మించి జోరు చూపిస్తాయో చూడాలి.