బాక్స్ ఆఫీస్ దగ్గర ఆగస్టు 15 వీకెండ్ లో పెద్ద చిన్న సినిమాలు చాలానే రిలీజ్ అవ్వగా ఉన్నంతలో చిన్న సినిమా అయిన ఆయ్(Aay Movie 2 Days Collections) సినిమా మాత్రం ఊహించని విధంగా మిగిలిన సినిమాలతో పోల్చితే బెటర్ రెస్పాన్స్ ను ఆడియన్స్ నుండి సొంతం చేసుకుని దుమ్ము లేపింది… దాంతో మొదటి రోజు లిమిటెడ్ షోలతోనే మంచి ఓపెనింగ్స్ ని సొంతం చేసుకున్న ఆయ్ మూవీ…
రెండో రోజు ఫుల్ వర్కింగ్ డే లో ఎంటర్ అవ్వగా మిగిలిన సినిమాలతో పోల్చితే బెటర్ గా ట్రెండ్ అయిన సినిమా ఏకంగా ఆగస్టు 15 వీకెండ్ లో బిగ్గీలో ఒకటైన రవితేజ(Raviteja) మిస్టర్ బచ్చన్(Mr Bachchan) డే 2 కన్నా కూడా ఎక్కువ టికెట్ సేల్స్ తో దుమ్ము లేపడం అందరినీ ఆశ్యర్య పరిచింది. రెండో రోజు మిస్టర్ బచ్చన్ కి 15 వేల రేంజ్ లో..
టికెట్ సేల్స్ సొంతం అవ్వగా ఆయ్ మూవీ కి మాత్రం రెండో రోజు వర్కింగ్ డే లో ఏకంగా 20 వేలకు పైగా టికెట్ సేల్స్ సొంతం అయ్యి సంచలనం సృష్టించింది. అసలు పోటిలో ఎవ్వరూ ఊహించని చిన్న పెద్ద సినిమా కన్నా కూడా బెటర్ గా ట్రెండ్ అయ్యింది. ఓవరాల్ గా రెండో రోజు ఆయ్ మూవీ తెలుగు రాష్ట్రాల్లో 90 లక్షలకు పైగా షేర్ ని సొంతం చేసుకోవడం విశేషం కాగా…
ఓవరాల్ గా ఆయ్ మూవీ ఇప్పుడు 2 రోజులు పూర్తి అయ్యే టైంకి ట్రేడ్ లెక్కల్లో సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే…
#AayMovie 2 Days Total Collections
👉Nizam: 66L~
👉Ceeded: 13L
👉Andhra: 66L
AP-TG Total:- 1.45CR(2.65CR~ Gross)
👉Ka+ROI+OS – 14L~
Total WW Collections – 1.59CR(2.95CR~ Gross)
మొత్తం మీద సినిమా వాల్యూ బ్రేక్ ఈవెన్ టార్గెట్ రేంజ్ 3.5 కోట్లకు పైగా షేర్ అందుకోవాల్సిన అవసరం ఉండగా 2 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ కాకుండా ఇంకా 1.9 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోవాల్సిన అవసరం ఉండగా ఇక మూడు రోజుల హాలిడే ల అడ్వాంటేజ్ ఉండటంతో మిగిలిన సినిమాల మీద…
ఆయ్ మూవీ ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో జోరు చూపించే అవకాశం ఉండగా లిమిటెడ్ థియేటర్స్ లో కూడా బిగ్ మూవీస్ ని బీట్ చేస్తున్న ఆయ్ అనే చిన్న సినిమా ఇక లాంగ్ వీకెండ్ లో టార్గెట్ ను అందుకునే అవకాశం ఎంతైనా ఉండగా లాంగ్ రన్ లో మంచి లాభాలను అందుకునే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి ఇప్పుడు.