Home న్యూస్ మా నాన్న సూపర్ హీరో 2 డేస్ కలెక్షన్స్…..షాకిచ్చే కలెక్షన్స్!!

మా నాన్న సూపర్ హీరో 2 డేస్ కలెక్షన్స్…..షాకిచ్చే కలెక్షన్స్!!

0
Sudheer Babu Maa Nanna Super Hero Movie 2 Days Collections
Sudheer Babu Maa Nanna Super Hero Movie 2 Days Collection

బాక్స్ ఆఫీస్ దగ్గర చాలా టైంగా ఓ మంచి హిట్ కోసం ఎదురు చూస్తున్న సుదీర్ బాబు(Sudheer Babu) నటించిన లేటెస్ట్ మూవీ మా నాన్న సూపర్ హీరో(Maa Nanna Super Hero Movie 2 Days Collections) రీసెంట్ గా రిలీజ్ అవ్వగా మంచి రెస్పాన్స్ నే ఆడియన్స్ నుండి సొంతం చేసుకుంది… క్లాస్ మూవీస్ ఇష్టపడే ఆడియన్స్ నుండి…

మంచి పాజిటివ్ రెస్పాన్స్ ను సొంతం చేసుకున్న సినిమా ఇక సుదీర్ బాబుకి మంచి కలెక్షన్స్ సొంతం అయ్యేలా చేస్తుంది అని అనుకున్నా కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర కలెక్షన్స్ పరంగా ఏమాత్రం ఇంపాక్ట్ ను చూపించ లేక పోయింది సినిమా…

మొదటి రోజు కానీ రెండో రోజు దసరా హాలిడే అడ్వాంటేజ్ ఉన్నా కూడా ఆన్ లైన్ టికెట్ సేల్స్ పరంగా కనీసం 10 వేల టికెట్ సేల్స్ ను కూడా ఓవరాల్ గా అందుకోలేక పోయింది. చాలా చోట్ల డెఫిసిట్ లు నెగటివ్ షేర్స్ కూడా పడగా ఓవరాల్ గా అవన్నీ తీయకుండా…

2 రోజుల్లో ఓవరాల్ గా సినిమా బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ లెక్కలను గమనిస్తే… 
Maa Nanna Superhero 2 Days Collections Report
👉Nizam: 20L~
👉Total Andhra: 22L
AP-TG Total:- 0.42CR(0.75CR~ Gross)
👉KA+ROI+OS:6L~
Total WW Collections: 0.48CR~(0.90CR~ Gross)

మొత్తం మీద సినిమా వాల్యూ బిజినెస్ రేంజ్ ఒక 4.5 కోట్ల రేంజ్ దాకా ఉంటుందని అంచనా…సినిమా డీసెంట్ హిట్ అనిపించుకోవాలి అనుకున్నా మినిమమ్ 5 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోవాల్సి ఉంటుంది. కానీ సినిమా మంచి టాక్ తో కూడా ఆడియన్స్ ను థియేటర్స్ కి రప్పించ లేక పోయింది. 

టాలీవుడ్ ఆడియన్స్ మంచి మూవీస్ వస్తే కచ్చితంగా చూస్తారు అంటారు కానీ అప్పుడప్పుడు మాత్రం రివ్యూలు డీసెంట్ గా ఉన్నా కూడా కొన్ని సినిమాలను ఏమాత్రం పట్టించుకోవడం లేదు. ఇప్పుడు మా నాన్న సూపర్ హీరో సినిమా విషయంలో కూడా ఇదే రిపీట్ అయ్యేలా కనిపిస్తుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here