కన్నడ యాక్టర్ ఉపేంద్ర(Upendra) చాలా టైం తర్వాత డైరెక్ట్ చేసిన యుఐ మూవీ(UI Movie) ఆడియన్స్ ముందుకు రీసెంట్ గా రిలీజ్ అవ్వగా, టాక్ పరంగా ఒక్కో చోట ఒక్కో రకమైన టాక్ ను సొంతం చేసుకున్న సినిమా మొదటి రోజు అన్ని చోట్లా మంచి కలెక్షన్స్ తో ఈ ఇయర్ కన్నడ సినిమాల పరంగా బెస్ట్ ఓపెనింగ్స్ ని…
అందుకుని దుమ్ము లేపగా రెండో రోజు సినిమా టాక్ ఇంపాక్ట్ వలన స్లో అవుతుంది అనుకున్నా కూడా ఎక్స్ లెంట్ హోల్డ్ తో దుమ్ము లేపింది ఇప్పుడు. మొదటి రోజు 80 లక్షల రేంజ్ లో గ్రాస్ ను అందుకోగా రెండో రోజు సినిమా మరోసారి మంచి జోరునే చూపిస్తూ…
85 లక్షల రేంజ్ లో మరోసారి మంచి జోరుని చూపించింది ఇప్పుడు. ఓవరాల్ గా రెండు రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో 1.65 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను అందుకున్న సినిమా 85 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకున్న సినిమా ఓవరాల్ గా ఇక్కడ డీసెంట్ హిట్ అనిపించుకోవాలి అంటే…
3.5 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోవాల్సిన అవసరం ఉండగా ఇంకా జోరు చూపించాల్సిన అవసరం ఉంది. ఇక కర్ణాటకలో రెండో రోజు మరోసారి మంచి హోల్డ్ ని చూపించి 6.25 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను సొంతం చేసుకోగా మొత్తం మీద ఇప్పుడు 2 రోజుల్లో…
టోటల్ వరల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే…
UI Movie 2 Days Total World Wide Collections Approx.
👉Karnataka – 13.55Cr
👉Telugu States – 1.65Cr
👉ROI – 0.30Cr
👉Overseas – 0.50Cr***approx.
Total WW collection – 16.00CR(7.50CR~ Share) Approx.
మొత్తం మీద సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర వరల్డ్ వైడ్ గా డీసెంట్ హిట్ అనిపించుకోవాలి అంటే 35 కోట్ల లోపు షేర్ ని అందుకోవాల్సిన అవసరం ఉండగా సినిమా ఇంకా 27.50 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇక సినిమా 3వ రోజు ఎలాంటి కలెక్షన్స్ ని అందుకుంటుందో చూడాలి.