Home న్యూస్ కేజిఎఫ్ రేంజ్ లో ఆకట్టుకుంటున్న కబ్జా టీసర్….కానీ!!

కేజిఎఫ్ రేంజ్ లో ఆకట్టుకుంటున్న కబ్జా టీసర్….కానీ!!

0

తెలుగు వాళ్ళకి సుపరిచితుడే అయిన కన్నడ హీరోల్లో ముందు నిలిచే హీరో ఉపేంద్ర…. ఒకప్పుడు విభిన్నమైన సినిమాలతో పేరు తెచ్చుకున్న ఉపేంద్ర ఇప్పుడు భారీ పాన్ ఇండియా సినిమాతో ఆడియన్స్ ముందుకు భారీ లెవల్ లో రావడానికి సిద్ధం అవుతున్నాడు, ఆ సినిమా కబ్జా…. రీసెంట్ గా సినిమా అఫీషియల్ టీసర్ ను రిలీజ్ చేయగా టీసర్ కి ఆడియన్స్ నుండి ఎక్స్ లెంట్ రెస్పాన్స్ సొంతం అవుతుంది అని చెప్పాలి…

టీసర్ విజువల్స్, ఎక్స్ లెంట్ టేకింగ్, బ్యాగ్రౌండ్ స్కోర్ చాలా బాగా ఆకట్టుకోగా ఉపేంద్రతో పాటు కిచ్చ సుదీప్ కూడా నటిస్తున్న ఈ సినిమా ఓవరాల్ టీసర్ కట్ మాత్రం యాసిటీస్ గా కేజిఎఫ్ సినిమా ను పోలి ఉందని చెప్పాలి…

అందులో ఉన్నట్లే ఇక్కడ కూడా గ్యాంగ్ స్టర్ స్టొరీ, ఓ అమ్మ సెంటి మెంట్, రవి బసృస్ మ్యూజిక్ ఇలా చాలా వరకు అన్నీ కేజిఎఫ్ ని పోలి ఉన్నాయి, కానీ కథ పాయింట్ ప్రీ ఇండిపెండెంట్స్ టైం లో ఓ సాధారణ వ్యక్తీ మాఫియాలో ఎలా చేరాడు తర్వాత ఏం జరిగింది అన్న కాన్సెప్ట్ తో…

తెరకెక్కిన సినిమాగా కబ్జా సినిమా ఆడియన్స్ ముందుకు రాబోతుంది, టీసర్ వరకు కేజిఎఫ్ ని గుర్తు చేసినా కథ బాగుంటే ఈ సినిమా కూడా ఆడియన్స్ ను మెప్పించే అవకాశం ఉందని చెప్పాలి. త్వరలోనే ఆడియన్స్ ముందుకు రాబోతున్న ఈ సినిమా ఎంతవరకు మెప్పిస్తుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here