Home న్యూస్ 2nd DAY అనుభవించు రాజా కలెక్షన్స్!!

2nd DAY అనుభవించు రాజా కలెక్షన్స్!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర యంగ్ హీరో రాజ్ తరుణ్ నటించిన లేటెస్ట్ మూవీ అనుభవించు రాజా మొదటి రోజు ఉన్నంతలో ప్రస్తుత పరిస్థితులను కూడా తట్టుకుని మంచి వసూళ్ళనే ఓవరాల్ గా సొంతం చేసుకుంది అని చెప్పాలి. సినిమా మొదటి రోజు తక్కువ కలెక్షన్స్ వస్తాయి అనుకుంటే కొంచం బెటర్ గానే వసూళ్ళని సొంతం చేసుకుని వరల్డ్ వైడ్ గా 73 లక్షల దాకా షేర్ ని ఓవరాల్ గా సొంతం చేసుకుంది.

అందులో తెలుగు రాష్ట్రాలలో 67 లక్షల దాకా షేర్ ని సాధించిన ఈ సినిమా రెండో రోజు కి వచ్చే సరికి మొదటి రోజు తో పోల్చితే 20-25% వరకు డ్రాప్స్ ను రోజు మొత్తం కంటిన్యూ చేసింది అని చెప్పాలి. ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ కూడా డ్రాప్స్ కనిపించగా మొదటి రోజుతో పోల్చితే…

2 వ రోజు ఇలాంటి డ్రాప్స్ కామన్ అనే చెప్పాలి, ఓవరాల్ గా సినిమా ఈ రోజు తెలుగు రాష్ట్రాలలో 40 లక్షల రేంజ్ లో కలెక్షన్స్ ని అందుకునే అవకాశం ఉంది, ఒకవేళ ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు బాగుంటే సినిమా రెండో రోజు కలెక్షన్స్ ఇంకా బెటర్ గా ఉండొచ్చు. మరి సినిమా అఫీషియల్ గా ఎలాంటి కలెక్షన్స్ ని సొంతం చేసుకుంటుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here