రామ్ గోపాల్ వర్మ లేటెస్ట్ సెన్సేషనల్ మూవీ లక్ష్మీస్ ఎన్టీఆర్ బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి రోజు అంచనాలకు మించి వసూల్ చేసిన తర్వాత ఇప్పుడు రెండో రోజు కూడా జోరు చూపింది, సినిమా రెండో రోజు మార్నింగ్ అండ్ మ్యాట్నీ షోల కి మొదటి రోజు తో పోల్చితే కేవలం 15% వరకు మాత్రమె డ్రాప్స్ ని సొంతం చేసుకుంది, ఈవినింగ్ అండ్ నైట్ షోల బుకింగ్స్ కూడా మెల్లి మెల్లి గా జోరు అందుకున్నా…
ఈవినింగ్ అండ్ నైట్ షోల కి IPL మ్యాచుల వలన కొద్దిగా ఎఫెక్ట్ పడింది, దాంతో ఓవరాల్ గా రోజు ని బాగానే ముగించినా కానీ కలెక్షన్స్ పరంగా కొద్దిగా స్లో డౌన్ అయిందని చెప్పొచ్చు. ఉన్నంతలో నైజాం ఏరియా లో సినిమా రెండో రోజు ఓవరాల్ ఆన్ లైన్…
టికెట్ సేల్స్ ని బట్టి చూస్తె 50 లక్షల కు పైగా షేర్ ని అందుకోవడం మాత్రం పక్కా అని చెప్పాలి, ఒకవేళ ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ అనుకున్న రేంజ్ లో ఉంటే ఈ లెక్క పెరిగే అవకాశం ఉంది, ఇక టోటల్ వరల్డ్ వైడ్ గా సినిమా రెండో రోజున తక్కువ లో తక్కువ…
70 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకోవచ్చు, ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ ఎఫెక్ట్ పడకుంటే ఈ లెక్క పెరిగే అవకాశం ఉంటుంది, సినిమా అడ్వాన్స్ బెసెస్ మీద రిలీజ్ చేయడం తో లాంగ్ రన్ లో సినిమా కి మంచి వసూళ్లు దక్కే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి.
ఆంద్రా లో ఎలాగైనా రిలీజ్ చేయాలనీ నిర్మాతలు కూడా ప్రయత్నాలు చేస్తున్నారు, అది ఒకే అయితే కలెక్షన్స్ లో మరింత గ్రోత్ ఉండే అవకాశం ఉంది, మరి 2 రోజుల అఫీషియల్ కలెక్షన్స్ వివరాలు ఎలా ఉంటాయో చూడాలి. న్యూస్ అప్ డేట్స్ కోసం బెల్ ఐకాన్ ని ప్రెస్ చేసి సబ్ స్బైబ్ చేసుకోండి.. అప్ డేట్ రాగానే నోటిఫికేషన్ మీకు అందుతుంది.