Home న్యూస్ రాక్షసుడు డే 2 కలెక్షన్స్…ఇది సరిపోదు సామి!!

రాక్షసుడు డే 2 కలెక్షన్స్…ఇది సరిపోదు సామి!!

0

     కెరీర్ మొదలు పెట్టి 5 ఏళ్ల సమయం అవుతున్నా ఒక అల్ట్రా పాజిటివ్ టాక్ ఉన్న సినిమా కోసం ఎదురు చూస్తున్న బెల్లంకొండ శ్రీనివాస్ కి లేటెస్ట్ మూవీ రాక్షసుడు ఆ కొరత తీర్చింది, సినిమా రిలీజ్ అవ్వడమే సూపర్ పాజిటివ్ టాక్ తో రిలీజ్ అవ్వగా తొలిరోజు వర్షాల వలన సినిమా మరీ అనుకున్న రేంజ్ వసూళ్ళ ని బాక్స్ ఆఫీస్ బరిలో సాధించలేదు. కాగా ఇప్పుడు రెండో రోజు లో సినిమా….

డీసెంట్ కలెక్షన్స్ తో హోల్డ్ చేసిందని చెప్పొచ్చు. మార్నింగ్ అండ్ మ్యాట్నీ షోల తో పోల్చితే ఈవినింగ్ అండ్ నైట్ షోలలో మల్టీ ప్లెక్సులలో జోరు చూపిన ఈ సినిమా క్లాస్ సెంటర్స్ లో కూడా బాగానే పెర్ఫార్మ్ చేసింది, కానీ మాస్ సెంటర్స్ లో ఆక్యుపెన్సీ యావరేజ్ గానే ఉంది.

ఓవరాల్ గా సినిమా రెండో రోజు ఈవినింగ్ అండ్ నైట్ షోలలో ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ బాగుంటే 1.5 కోట్ల రేంజ్ వసూళ్ళ ని అందుకోవడం ఖాయంగా కనిపిస్తుంది, అలాగే వరల్డ్ వైడ్ గా రెండో రోజున సినిమా 1.7 కోట్ల వరకు షేర్ ని సాధించవచ్చు… కానీ ఇది ఏమాత్రం సరిపోదు అనే చెప్పాలి.

సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 16.2 కోట్ల బిజినెస్ ని 17.2 కోట్ల టార్గెట్ తో బరిలోకి దిగగా సినిమా మొదటి రోజే 3 కోట్లు అనుకుంటే 70 లక్షలు తక్కువ వసూల్ చేయగా రెండో రోజు భారీ హోల్డ్ తో మినిమం 2.5 నుండి 2.8 కోట్ల రేంజ్ షేర్ ని వసూల్ చేస్తేనే…

బిజినెస్ ని అందుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కానీ సినిమా రెండో రోజు కూడా తక్కువ వసూళ్ళనే వర్షాల కారణంగా అలాగే మాస్ సెంటర్స్ అండర్ పెర్ఫార్మ్ వలన అందుకునేలా కనిపించడం లేదు. కానీ టాక్ బాగుండటం తో లాంగ్ రన్ లో సినిమా మరింత కష్టపడితే ఈ బ్రేక్ ఈవెన్ మార్క్ ని అందుకునే అవకాశం ఉంటుందని చెప్పొచ్చు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here